YSR Smruthi Vanam: ప్రీ వెడ్డింగ్ షూట్ లకు రాష్ట్రంలో ప్రసిద్ధి వైయస్సార్ స్మృతి వనం.. 100 కోట్లతో నగరవన ఏర్పాటుకు శ్రీకారం

కాబోయే దంపతులకు దివంగత వైయస్సార్ స్మృతి వనం ప్రి వెడ్డిండ్ షూట్ లకు కేంద్రమైంది. ఆహ్లాదకర, పచ్చటి వాతావరణంలో కాబోయే జంటలు అడుతు పాడుతూ స్టెప్పులేస్తు మైమరచి పోతున్నారు. రాష్టంలోని పర్యాటక కేంద్రాలలో ప్రసిద్ధిగాంచిన వైయస్ అర్ స్మృతి వనం వెడ్డింగ్, బేబీ షూటింగ్ కొరకు రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి వస్తుండటంతో తన ఖ్యాతిని మరింత చాటుతుంది.

J Y Nagi Reddy

| Edited By: Surya Kala

Updated on: Dec 18, 2023 | 4:28 PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ లో ప్రయాణం చేస్తూ ప్రమాదవశాత్తు పావురాల గుట్టలో హెలికాప్టర్ కూలి చనిపోవడంతో ఆయన జ్ఞాపకంగా ఆత్మకూరు ప్రాంతంలోని నల్లకాలువ సమీపంలో వైయస్సార్ స్మృతి వనం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.

1 / 9
రాష్టంలోని పర్యాటక కేంద్రాలలో ప్రసిద్ధిగాంచిన వైయస్ అర్ స్మృతి వనం వెడ్డింగ్, బేబీ షూటింగ్ కొరకు రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి వస్తుండటంతో తన ఖ్యాతిని మరింత చాటుతుంది.

2 / 9
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జ్ఞాపకార్థం 2010 వ సంవత్సరంలో ఉమ్మడి కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం నల్లకాలువ సమీప నల్లమల అంచుల్లో సుమారు 14.50 కోట్ల రూపాయల వ్యయం తో 22.20 ఏకరాల్లో అత్యంత సుందరంగా నిర్మించిన వైయస్ అర్ స్మృతి వనం పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తుంది.

3 / 9
వైయస్సార్ స్మృతి వనం భూమికి పచ్చటి రంగేసినట్లు ఉంటుంది. ప్రధానంగా స్మృతి వనంలో సుగంధ వాసనలు పరిమళించే చెట్లు, మనుషులకు సంభంధించిన నక్షత్రాలకు అనుగుణంగా నక్షత్ర వనాలను నిర్మించారు.

4 / 9
50 అడుగుల వైయస్సార్ కాంస్య విగ్రహం స్మృతి వనంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే రాత్రి సమయాల్లో వైయస్సార్ విగ్రహం చుట్టు పక్కల వాటర్ స్కిపింగ్ ప్రధానాకర్షణగా నిలుస్తుంది. 

5 / 9
పిల్లల కొరకు ఏగుడు దిగుడు ల్యాండ్ స్కెప్ లు ఉయ్యాలలు... పిల్లలను ఆకర్షించే తూగుడుఉయ్యాలలు ఏర్పాటు చేశారు. నల్లమల అందాలను వీక్షించేందుకు వ్యూ టవరు ఏర్పాటు చేశారు. పర్యాటకులకు అరుదైన వన్య ప్రాణుల, చిన్న పిల్లలకు సంభందించిన యాక్షన్ సినిమాలు వీక్షించేందుకు భారీ స్క్రీన్ లతో పర్యావర విక్షణకేంద్రాలను ఏర్పాటు చేశారు. 

6 / 9
నల్లమల అందాలను మొత్తం వైయస్ స్మృతి వనంలో చూడవచ్చు. పకృతి ఒడిలో పర్యావరణ ప్రేమికులు... పర్యటకులు సేద తీరుతుండగా... నూతన వధువరులు మాత్రం ఫోటో షూటింగ్ లతో పరవశించి పోతుంటారు. పెళ్లి షూట్ లు, బర్త్డే షూట్ లతో  కళకళ లాడుతుంది.

7 / 9
నంద్యాల జిల్లా ముఖద్వారమైన శ్రీశైల క్షేత్రం.... అలాగే మహానంది లాంటి శైవ క్షేత్రాలకు వెళ్ళే భక్తులు వైయస్సార్ స్మృతి వనం సందర్శించి పకృతి ఆందాలను ఆస్వాదిస్తుంటారు. ఈ స్మృతి వనం చూడడానికి కర్నూల్ నుంచి 70 కిలోమీటర్లు నంద్యాల నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నంద్యాల నుంచి ఆత్మకూరుకు వచ్చే ప్రధాన రహదారిలో ఆత్మకూరుకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ వైయస్సార్ వనం  ఉంటుంది..

8 / 9
ఈ స్మృతి వనం మరింతగా తీర్చిదిద్దేందుకు ఇప్పటి ప్రభుత్వం సుమారు 100 కోట్లతో తాజాగా నగరవనం ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నగరవనంలో కాటేజీలు స్విమ్మింగ్ పూల్ తదితర ఏర్పాట్లతో మరింత నూతన ఏర్పాట్లు చేయబోతున్నారు. 2016వ సంవత్సరంలో ఈ వైయస్సార్ స్మృతి వనంకు కేంద్ర ప్రభుత్వం బెస్ట్ గ్రీనరీ అవార్డు కూడా ఇచ్చింది.  ఈ స్మృతి వనంలోకి ఒక్కసారి ఎంటర్ అయితే సాయంత్రం దాకా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ సమయం కూడా తెలియకుండా గడిపేయవచ్చు. 

9 / 9
Follow us