- Telugu News Photo Gallery Cinema photos Deepika Padukone plans for next year and their successful possibilities
Deepika Padukone: వచ్చే ఏడాది ‘దీపిక’ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి.? వాటి కోసం అమ్మడు ఏం చేస్తుందంటే
2023 ఎలా ఉందో, యాజ్ ఇట్ ఈజ్‌గా 2024 కూడా ఉంతే బావుంటుందని అనుకుంటున్నారు మేడమ్ దీపిక పదుకోన్. ఆ మాటకొస్తే 2024ని ఇంకా స్పెషల్‌గా కన్సిడర్ చేస్తున్నారు ఈ బ్యూటీ. వచ్చే ఏడాది మేడమ్ దీపిక చేసుకుంటున్న ప్లాన్స్ ఏంటి? వాటి సక్సెస్‌కున్న పాసిబిలిటీస్ ఏంటి? చూసేద్దాం వచ్చేయండి.... షరమ్ రంగ్ అంటూ దీపిక పదుకోన్ చూపించిన హొయలు చూశాక, పఠాన్ మీద అంతకు ముందు లేనంతగా ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి.
Updated on: Dec 18, 2023 | 5:50 PM

.2023 ఎలా ఉందో, యాజ్ ఇట్ ఈజ్‌గా 2024 కూడా ఉంతే బావుంటుందని అనుకుంటున్నారు మేడమ్ దీపిక పదుకోన్. ఆ మాటకొస్తే 2024ని ఇంకా స్పెషల్‌గా కన్సిడర్ చేస్తున్నారు ఈ బ్యూటీ. వచ్చే ఏడాది మేడమ్ దీపిక చేసుకుంటున్న ప్లాన్స్ ఏంటి? వాటి సక్సెస్‌కున్న పాసిబిలిటీస్ ఏంటి? చూసేద్దాం వచ్చేయండి....

బేషరమ్ రంగ్ అంటూ దీపిక పదుకోన్ చూపించిన హొయలు చూశాక, పఠాన్ మీద అంతకు ముందు లేనంతగా ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. సినిమాలో కేవలం గ్లామరే కాదు, యాక్షన్ పరంగానూ కేక అనిపించారు దీపిక.

ఆ తర్వాత షారుఖ్ జవాన్‌లోనూ ది బెస్ట్ రోల్ చేశారు. ఒకే ఏడాది బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాల్లో నటించిన హీరోయిన్‌గా రికార్డు క్రియేట్ చేశారు దీపికా పదుకోన్.

ఓ వైపు నార్త్ లో బిజీగా ఉన్నప్పటికీ, సౌత్‌లోనూ కల్కి షూట్‌లో ఇష్టంగా పార్టిసిపేట్ చేశారు ఈ బ్యూటీ. ప్రభాస్‌తో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న కేరక్టర్‌ని దీపిక కోసం రాశారట నాగ్ అశ్విన్. ఈ సినిమా కోసం ఇష్టంగా ఎదురుచూస్తున్నారు దీపిక.

2024లో దీపిక నుంచి రిలీజ్ అయ్యే ఫస్ట్ సినిమా ఫైటర్. ఫస్ట్ ఏరియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. హృతిక్‌తో దీపిక జోడీ కడుతున్నారనే వార్త అప్పట్లో ప్యాన్ ఇండియా ప్రేక్షకుల్లో ఉల్లాసం నింపేసింది. ఇప్పుడు టీజర్, ఫస్ట్ సింగిల్ చూసిన వారందరూ వావ్... వి ఆర్ వెయిటింగ్ అని అంటున్నారు. లాస్ట్ ఇయర్ రిపబ్లిక్ డే కి సూపర్‌డూపర్ సక్సెస్ కొట్టిన దీపిక, ఈ ఏడాది కూడా అదే డేట్ మీద ఫోకస్ చేస్తున్నారు.




