- Telugu News Photo Gallery Cinema photos Heroines who are getting ready to act for the first time in Tollywood
New Heroines: వచ్చే ఏడాది తెలుగులో కొత్త భామల సందడి.. ఫస్ట్ టైమ్ మెప్పించనున్న ఆ ముద్దుగుమ్మలు ఎవరు.?
కొత్త ఏడాదిలోకి సరికొత్త ఆశలతో అడుగుపెట్టాలని విష్‌లిస్ట్ రాసుకుంటున్నారు కొందరు ముద్దుగుమ్మలు. టాలీవుడ్‌లో ఫస్ట్ టైమ్ కనిపించడానికి రెడీ అవుతున్న ఆ భామలెవరు? ఏయే సినిమాలతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు? మనం కూడా చూసేద్దాం రండి.
Updated on: Dec 18, 2023 | 4:48 PM

Devara, Jahnvi Kapoor

నార్త్ నుంచి జాన్వీని ఫాలో అవుతున్న మరో నాయిక మానుషి చిల్లర్. వరుణ్‌తేజ్‌తో కలిసి నటిస్తున్నారు మానుషి. వచ్చేఏడాది రిలీజ్‌కి రెడీ అవుతోంది ఆపరేషన్ వేలంటైన్.

మా మాస్ మహరాజ్‌కి జోడీ, క్లాస్ మహరాణీ అంటూ భాగ్యశ్రీ బోర్సేని ప్రకటించారు మేకర్స్. మోడల్‌గా పేరు తెచ్చుకున్న భాగ్యశ్రీ యారియాన్2 మూవీతో బాలీవుడ్‌లో మెప్పించారు. గ్లామర్‌డాల్‌గానే కాకుండా, పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రల్లోనూ మెప్పిస్తారనే గుర్తింపు తెచ్చుకున్నారు భాగ్యశ్రీ.

2023లోనే తెలుగు ఇండస్ట్రీని పలకరించినా హిట్ అందుకోలేకపోయారు ఆషికా రంగనాథ్. 2024 జనవరిలో వచ్చే నా సామిరంగతో ఫ్రెష్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఆల్రెడీ అమ్మడి సాంగ్ క్లిక్ అయింది. సినిమాకి కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వస్తే, ఇక ఆగేదేలేదు అంటారేమో ఆషికా.

ఇన్నేళ్లూ మనల్ని స్పెషల్ సాంగుల్లో అలరించిన నోరా ఫతేహి హరిహరవీరమల్లులో నటించారు. పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆఫ్టర్ ఎలక్షన్స్ రెజ్యూమ్ అయి, 2024లో రిలీజ్‌ని ఫిక్స్ చేసుకుంటే నోరా కూడా నాయికగా ఎంట్రీ ఇచ్చేసినట్టే అవుతుంది మరి.




