Gaming Laptops: గేమ్స్ కోసం.. ఈ ల్యాప్‌టాప్స్‌కు మించినవి లేవంతే.. తక్కువ ధరలోనే సూపర్ ఫీచర్స్
ల్యాప్‌టాప్‌లు అనేవి ఇటీవల కాలంలో యువతను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. పెరుగుతున్న టెక్నాలజీ నేపథ్యంలో గతంలో ఆరుబయట ప్రాంతాల్లో ఆడుకునే వారు ఇప్పుడు ల్యాప్‌టాప్స్ లేదా స్మార్ట్‌ఫోన్స్‌లో ఆడుకుంటున్నారు. వ్యక్తిగత ప్రాధాన్యతలు, గేమింగ్ అవసరాల ఆధారంగా గేమింగ్ ల్యాప్‌టాప్‌లలో నిర్దిష్ట అవసరాలు మారుతూ ఉంటాయి. కాబట్టి సున్నితమైన గేమ్‌ప్లే కోసం ఇంటెల్ కోర్ ఐ5 లేదా ఏఎండీ రైజెన్ 5 వంటి శక్తివంతమైన ప్రాసెసర్‌లు, మెరుగైన విజువల్స్ కోసం అంకితమైన గ్రాఫిక్స్ కార్డ్‌లు అవసరం. అలాగే మల్టీ టాస్కింగ్, గేమ్ పనితీరు కోసం తగినంత ర్యామ్ అవసరం. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో రూ.60 వేల కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉన్న ల్యాప్‌టాప్ష్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5