- Telugu News Photo Gallery Technology photos Redmi launching new smartphone Redmi Note 13 Pro features and price details
Redmi Note 13 Pro+: స్టైలిష్ లుక్, అదిరిపోయే ఫీచర్స్.. రెడ్‌మీ కొత్త ఫోన్ ధరెంతో తెలుసా.?
భారత మార్కెట్లోకి మరో సూపర్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతోంది. బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్‌లను లాంచ్ చేస్తూ వస్తున్న చైనాకు చెందిన దిగ్గజ సంస్థ షావోమీ తాజాగా మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Dec 19, 2023 | 11:07 AM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ రెడ్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. రెడ్‌మీ నోట్ 13 ప్రో+ పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరి 4వ తేదీన ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నారు.

ఇక రెడ్ నోట్ 13 ప్రో+ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. మీడియా టెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఈ ప్రాసెసర్‌తో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో ఐపీ68 రేటింగ్‌తో కూడిన వాటర్ రెసిస్టెంట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

స్క్రీన్ విషయానికొస్తే ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన ఓఎల్‌ఈడీ స్క్రీన్‌ను ఇవ్వనున్నారు. 1.5 కే రిజల్యూషన్, 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన స్క్రీన్ ఈ ఫోన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఈ ఫోన్‌లో 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌ను అందించారు.

కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. 4కే రిజల్యూషన్‌తో కూడిన వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.

చైనాలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌ను జనవరి 4వ తేదీన లాంచ్ చేయనున్నారు. ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 23,500గా నిర్ణయించారు.




