- Telugu News Photo Gallery Technology photos These are the ways to a virus enter into smartphone and signs of it
Smartphone: స్మార్ట్‌ఫోన్‌లోకి వైరస్ ఎంటర్ అయ్యే మార్గాలు ఇవే.. జాగ్రత్తగా ఉండండి.
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడని వారిని భూతద్ధంలో వెతికినా దొరకని పరిస్థితి ఉంది. అన్ని పనులకు స్మార్ట్ ఫోన్ అనివార్యంగా మారిన నేపథ్యంలో వీటి వినియోగం సైతం పెరిగింది. అయితే స్మార్ట్ ఫోన్స్‌ను వైరస్ అనే సమస్య వేధిస్తుంది. ఇంతకీ స్మార్ట్ ఫోన్‌లోకి వైరస్ ఎలా ఎంటర్ అవుతుంది..? అసలు ఫోన్‌లోకి వైరస్ ఎంటర్ అయిన విషయాన్ని ఎలా తెలసుకోవాలి.? ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Dec 18, 2023 | 11:52 AM

స్మార్ట్ ఫోన్‌లోకి వైరస్‌లు ఎంటర్ కావడానికి ప్రధాన కారణం. తెలిసీతెలియక మనం క్లిక్ చేసే లింక్స్. కొన్నిసార్లు ఫోన్‌లకు టెక్ట్స్ మెసేజ్ రూపంలో కొన్ని లింక్స్ వస్తాయి. వాటిని క్లిక్ చేస్తే ఆఫర్స్ అంటూ మెసేజ్‌లు పంపిస్తుంటారు. అయితే వీటిని పొరపాటున క్లిక్ చేస్తే ఫోన్‌లోకి వైరస్‌లు ఎంటర్ అవుతాయి.

ఫోన్‌లోకి వైరస్ ఎంటర్ అయ్యేందుకు ఉన్న మరో మార్గం. కొన్ని రకాల వెబ్‌సైట్స్.. భారీ డిస్కౌంట్స్ అంటూ కొన్ని ఫేక్ వెబ్‌సైట్స్ ప్రచారం చేస్తుంటాయి. ఇలాంటి వాటిని క్లిక్ చేస్తే ఫోన్‌లోకి వైరస్‌లో ఎంటర్ అవుతాయి. దీంతో మీ ఫోన్ ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోతుంది.

గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉండకుండా ఏపీకే ఫైల్స్ రూపంలో ఉండే కొన్ని రకాల యాప్స్ ద్వారా కూడా వైరస్‌లు ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏవైనా యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. యాప్ రివ్యూస్‌ను చెక్ చేసిన తర్వాతే డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ఇక ఉచితంగా లభించే వైఫ్‌ల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని టెక్ నిపుణులు చెబుతున్నారు. కొంతమంది సైబర్ నేరగాళ్లు ఫ్రీ వైఫై ద్వారా ఫోన్‌లోకి వైరస్‌లను జొప్పించి ఫోన్‌ను హ్యాక్ చేస్తారు. కాబట్టి ఫ్రీ వైఫై విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి.

ఇదిలా ఉంటే ఫోన్‌లోకి వైరస్ ఎంటర్ అయ్యిందన్న విషయాన్ని కొన్ని సూచనల ఆధారంగా తెలుసుకోవచ్చు. ఉన్నపలంగా ఫోన్ బ్యాటరీ డిశ్చార్జ్ అవుతున్నా, ఫోన్‌లో అనుకోని యాడ్స్ పాప్ అప్ అవతున్నా, ఫోన్‌లో యాప్స్ వాటికవే డౌన్‌లోడ్ అవుతున్నా మీ ఫోన్ హ్యాక్ అయినట్లు గుర్తించాలని టెక్ నిపుణులు చెబుతున్నారు.





























