- Telugu News Photo Gallery Technology photos Pepe jeans launches smart watch pebble x pepe jeans features and price details
Pebble X Pepe Jeans: స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసిన పెపీ జీన్స్.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..
పెపీ జీన్స్.. ఈ పేరు వినగానే ఎవరికైనా దుస్తులే గుర్తుకొస్తొయి. అంతర్జాతీయంగా ఈ బ్రాండ్ దుస్తులకు ఉన్న క్రేజ్ ఎలాంటి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా జీన్స్ ప్యాంట్స్‌లో ఈ బ్రాండ్ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇదిలా ఉంటే ఈ దుస్తుల తయారీ కంపెనీ తాజాగా స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. పెబెల్ కంపెనీతో కలిసి మార్కెట్లోకి కొత్త స్మార్ట్ వాచ్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఈ వాచ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Dec 20, 2023 | 8:14 AM

ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ పెపీజీన్స్ టెక్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. పెబెల్ కంపెనీతో కలిసి ఓ స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. పెబుల్ ఎక్స్ పెపీ జీన్స్ పేరుతో ఈ స్మార్ట్ వాచ్‌ను తీసుకొచ్చారు.

పెపీ జీన్స్ స్టోర్స్‌తో పాటు, ఫ్లిప్‌కార్డ్ వంటి ఈ కామర్స్ సైట్స్‌లోనూ ఈ స్మార్ట్ వాచ్‌లు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక ఈ స్మార్ట్ వాచ్ ధర విషయానికొస్తే రూ. 2,199గా నిర్ణయించారు. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ వాచ్‌ను రూ. 1,999 తగ్గింపు ధరకు సొంతం చేసుకోవచ్చు.

పెబుల్ ఎక్స్ పెపీ జీన్స్ స్మార్ట్ వాచ్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.39 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఈ వాచ్ సొంతం. ఇందుకోసం ఇన్‌బుల్ట్ స్పీకర్‌ను అందించారు.

ఇక ఏఐ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ చేయడం ఈ స్మార్ట్ వాచ్ మరో ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇందులో 230 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. బ్లూటూత్ కాలింగ్‌తో 2 రోజులు, వితవుట్ బ్లూటూత్ కాలింగ్5 రోజుల పాటు పనిచేస్తుంది.

ఇక ఈ స్మార్ట్ వాచ్ ద్వారా SMS, సోషల్ మీడియా నోటిఫికేషన్‌లు, రిమైండర్స్, కాల్స్ కంట్రోల్, అలారం, కాలిక్యులేటర్, వెదర్ అప్‌డేట్స్, మ్యూజిక్ కంట్రోల్, హార్ట్ బీట్ మానిటర్, ఎస్‌పీఓ2, స్లీప్ ట్రాకింగ్‌తో పాటు టెన్నిస్, రగ్బీ వంటి వివిధ స్పోర్ట్స్ మోడ్‌లను అందించారు.





























