- Telugu News Photo Gallery Technology photos Poco launching new smart phone Poco M6 5g Features and price details
Poco M6: రూ. 10 వేలలో ఇలాంటి ఫీచర్స్ నెవర్ బిఫోర్.. 5జీ స్మార్ట్ ఫోన్..
మార్కెట్లో వరుసగా బడ్జెట్ ఫోన్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 5జీ సేవలు విస్తరిస్తున్న క్రమంలో తక్కువ బడ్జెట్‌లో 5జీ ఫోన్స్‌ను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో భౄరత మార్కెట్లోకి బడ్జెట్ ధరలో 5జీ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. పోకో ఎమ్6 పేరుతో తీసుకొస్తున్న ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Dec 20, 2023 | 11:52 AM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో తాజాగా కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. పోకో ఎమ్6 5జీ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు. డిసెంబర్ 22వ తేదీన భారత మార్కెట్లోకి ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు పోకో అధికారికంగా తెలిపింది.

ఈ స్మార్ట్ ఫోన్‌ను ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో డిసెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 10 వేల లోపు ఉండొచ్చని తెలుస్తోంది. ఇక కొనుగోలు సమయంలో పలు బ్యాంక్ కార్డులపై డిస్కౌంట్స్ అందించనున్నారు. ఈ ఫోన్‌ను బ్లాక్, సిల్వర్ కలర్స్‌లో అందుబాటులో ఉండనున్నాయి.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ విషయానికొస్తే ఇందులో.. 6.74 ఇంచెస్‌తో కూడిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించనున్నారు. 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. ఇక ఈ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో అందించనున్నారు.

పోకో ఎమ్6 5జీ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 18 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. అయితే ఫ్రంట్ కెమెరా గురించి ఎలాంటి సమాచారం అందించలేదు. సైడ్ మైంటెడ్ ఫింగర్ ప్రింట్‌తో పాటు, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్‌ను అందించారు. ఇదిలా ఉంటే పోకో ఎమ్6 ప్రో పేరుతో 4జీ ఫోన్‌ను కూడా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.





























