Health Tisp: శీతాకాలంలో వీటిని తినడం నిజంగా మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారు
చాలా మంది ఆరోగ్యం, బలం కోసం ఉదయాన్నే లేచిన వెంటనే నానబెట్టిన డ్రై ఫ్రూట్స్‌ను తింటూ ఉంటారు. అయితే ఈ మధ్య చాలా మందిలో ఒక డౌట్ మొదలైంది. శీతాకాలంలో డ్రై ఫ్రూట్స్ తినడం ప్రయోజనకరంగా ఉంటుందా లేదా అని.. ఆరోగ్య నిపుణుల ప్రకరాం ఆహారంతో పాటు, డ్రై ఫ్రూట్స్‌ను ఆరోగ్యానికి సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. ఇవి మన శరీరాన్ని లోపలి నుండి వెచ్చగా ఉంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అందుకే శీతాకాలంలో డ్రై ఫ్రూట్స్ తినడం మంచిదేనని నిపుణులు అంఉన్నారు. అయితే ఉదయం ఖాళీ కడుపుతో ఏ డ్రై ఫ్రూట్ తినడం ఉత్తమమో ఇక్కడ తెలుసుకోండి.
Updated on: Dec 01, 2025 | 2:15 PM

ఉదయం ఖాళీ కడుపుతో తినే డ్రై ఫ్రూట్స్ విషయానికి వస్తే అంజీర్ పండ్లు మొదటి వరుసలో ఉన్నాయి. వీటిలో సహజ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని రాత్రిపూట నానబెట్టి ఉదయం తినడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది, కడుపు శుభ్రంగా ఉంటుంది. ఇది ముఖ్యంగా మహిళలకు పెద్ద మొత్తంలో ఇనుమును అందిస్తుంది. ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది, ఇది బలహీనత, తలతిరగడం, అలసట వంటి సమస్యలను తగ్గిస్తుంది.

ఎండుద్రాక్ష: రాత్రిపూట నీటిలో నానబెట్టిన నల్ల ఎండుద్రాక్ష తినడం వల్ల శరీరానికి యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి, ఇది చర్మ కాంతిని పెంచుతుంది అలాగే వాపును తగ్గిస్తుంది. ఎండుద్రాక్ష హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది, ఇది రక్తహీనతతో బాధపడేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. దీనితో పాటు, నల్ల ఎండుద్రాక్షలో ఉండే సహజ గ్లూకోజ్ ఉదయం శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.

బాదం : ఇవి మన ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతాయి. అందుకే వైద్యులు తరచూ వీటిని తినమని సిఫార్స్ చేస్తారు. వీటిని పొట్టు తొలగించి తినడం వల్ల మన శరీరం వాటిలోని పోషకాలను ఎక్కువగా గ్రహిస్తుంది. వీటిలో ఉండే విటమిన్ E చర్మం మెరుపును పెంచుతుంది. అలాగే ఇందులో ఉండే మూలకాలు హార్మోన్లను సమతుల్యం చేసి.. మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి.

వాల్‌నట్స్ : వాల్‌నట్స్‌లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి మెదడు పనితీరుకు మెరుగుపరుస్తాయి. ఇది మన జ్ఞాపక శక్తి మెరుగుదలకు, ఏకాగ్రతను పెంచుతుంది. అలాగే ఇవి ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. వాల్‌నట్స్ జుట్టు, చర్మాన్ని మెరుగుపరిచి.. ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతాయి.

అయితే ఇక్కడ ఏది ప్రయోజకరంగా ఉంటుందనే.. అది మన శరీర అవసరాలకు అనుగుణంగా మారుతుంది. కాబట్టి మీరు ఒక నిర్దిష్ట డ్రై ఫ్రూట్‌ను ఎంచుకోవచ్చు లేదా కావాలనుకుంటే అన్ని డ్రై ఫ్రూట్‌లను కలిపి కూడా తినవచ్చు, కానీ సరైన పరిమాణంలో తీసుకోవడం ముఖ్యం.( ఫైన పేర్కోన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు)




