AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidney Stone: కిడ్నీలో రాళ్లు ఏర్పరిచే ఆహారాలు ఇవే! పొరబాటున కూడా వీటి జోలికి వెళ్లకండి..

మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో కిడ్నీలు ఒకటి. కిడ్నీ శరీరంలోని వ్యర్థాలను ఫిల్టర్ చేయడం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే కిడ్నీలో సమస్య వస్తే మాత్రం శరీరం మొత్తం కుప్పకూలిపోతుంది. నేటి కాలంలో చాలా మంది కిడ్నీ స్టోన్ సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీలో రాళ్లు ఏ వయసులోనైనా రావచ్చు. అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారం, తక్కువ నీరు తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి..

Srilakshmi C
|

Updated on: May 13, 2024 | 1:20 PM

Share
మన శరీరంలో గుండె,  కాలేయం మాదిరిగానే అతి ముఖ్యమైన అవయవాలలో కిడ్నీ ఒకటి. శరీర వ్యర్థాలు ఈ మూత్రపిండాల ద్వారా ఫిల్టర్ అవుతాయి. కిడ్నీలు ఆరోగ్యంగా లేకపోతే శరీరం మొత్తం ఆరోగ్యం చెడిపోతుంది. క్రమబద్ధమైన జీవనశైలి, తప్పుడు ఆహారం కారణంగా కిడ్నీలు దెబ్బతింటాయి. నేటి కాలంలో చాలా మంది కిడ్నీ స్టోన్ సమస్యలతో కూడా బాధపడుతున్నారు. అలాంటప్పుడు ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి

1 / 5
ముఖ్యంగా శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రూట్ వెజిటేబుల్స్ ఎక్కువగా తినకూడదు. వీటిల్లో అధిక మొత్తంలో ఆక్సలేట్‌లను కలిగి ఉంటాయి. ఇవి మూత్రపిండాల్లో రాళ్లను ఏర్పరుస్తాయి.వేసవిలో ప్రతి ఒక్కరూ శీతల పానీయాల పట్ల ఆసక్తి చూపుతారు. చాలా మంది ప్యాక్ చేసిన పండ్ల రసాలను ఎక్కువగా తీసుకుంటారు. అయితే ప్యాక్ చేసిన పండ్ల రసాలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల కంటే దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు. శీతల పానీయాలలో ఎక్కువ చక్కెర ఉండటం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి.

2 / 5
నేటి తరం ఫాస్ట్ ఫుడ్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతోంది. అంతేకాకుండా వేయించిన ఆహారాన్ని తినడానికి అమిత ఆసక్తి చూపుతున్నారు. ఇవి కిడ్నీలో రాళ్లకు కూడా కారణమవుతాయి. కాబట్టి వేయించిన ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.

3 / 5
ఉప్పు సాధారణంగా ఆరోగ్యానికి మంచిది కాదు. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల రక్తహీనత, అధిక రక్తపోటు సమస్యలు వస్తాయి. అంతేకాకుండా, కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కూడా కారణం అవుతాయి.

4 / 5
అధికంగా టీ లేదా కాఫీ తాగడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. రోజుకు రెండు నుంచి మూడు కప్పుల వరకు కాఫీ తాగడం మంచిది. కానీ, ఎక్కువ మొత్తంలో కాఫీ లేదా టీ తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉంది.

5 / 5
Follow Us