- Telugu News Photo Gallery If you want a stylish and cool look in winter then follow these fashion tips
Fashion Tips: చలికాలంలో ఇలాంటి డ్రెస్సులు సూపర్.. ఎవ్వరైనా సరే మీ డ్రెస్సింగ్ సెన్స్‌ని మెచ్చుకోకుండా ఉండలేరు..
Fashion Tips: అమ్మాయిలు తమను తాము ఆకర్షణీయంగా, కూల్‌గా కనిపించడానికి దుస్తులతో ప్రయోగాలు చేస్తారు. కానీ వింటర్ సీజన్‌లో ఫ్యాషన్‌ని మెయింటెయిన్ చేయడం కాస్త కష్టంగా మారుతుంది. అలాంటి వారు ఈ ఫ్యాషన్ టిప్స్ పాటిస్తే సూపర్‌గా ఉంటుంది.
Updated on: Jan 06, 2022 | 12:41 PM

వేసవిలో సమయానికి తగ్గట్లు దుస్తులు మారుస్తూ ఉంటారు కానీ శీతాకాలంలో అది సాధ్యం కాదు. ఎందుకంటే చలికాలంలో తప్పనిసరిగా కోటు వేసుకుని ఉండాలి. అప్పుడు దానిపై నుంచి బెల్ట్ ధరించడం ద్వారా మీరు కొత్త రూపాన్ని పొందవచ్చు. దీని కోసం కాంట్రాస్ట్ కలర్ బెల్ట్ ఉపయోగించండి.

ఈ రోజుల్లో కండువాలు ట్రెండ్‌లో ఉన్నాయి. ఇది మీకు కూల్, స్టైలిష్ లుక్ ఇవ్వడంలో సహాయపడుతుంది. అనేక రకాల స్కార్ఫ్‌లు మార్కెట్‌లో దొరుకుతాయి. మీరు వాటిని జాకెట్లు, స్వెటర్లు, ఓవర్‌కోట్‌లతో అనేక విధాలుగా ధరించవచ్చు.

మీరు క్యాజువల్స్ అండ్ స్టైలిష్ లుక్ కావాలనుకుంటే జీన్స్‌ని ప్రయత్నించవచ్చు. మీరు దీన్ని ఏదైనా పుల్‌ఓవర్‌తో ట్రై చేయాలి. అల్లిన బెల్ట్‌ను ధరిస్తే అందంగా కనిపిస్తారు.

మీరు ఏదైనా ప్రత్యేకంగా ధరించాలంటే కశ్మీరి జాకెట్, కుర్తాని ట్రై చేయండి. ఇది మీకు వెచ్చదనాన్ని ఇవ్వడమే కాకుండా ప్రత్యేక ఆకర్షణ తీసుకొస్తుంది.

చలికాలంలో పొడవాటి బూట్లు మీ స్టైల్‌ని పెంచుతాయి. మీరు వాటిని జీన్స్, స్కర్టులపై ధరిస్తే చూడటానికి అందంగా, హుందాతనంగా కనిపిస్తారు.



