Telugu News Photo Gallery If you drink spinach juice, both beauty and health are yours, Check Here is Details
Spinach Juice: పాలకూర రసం తాగితే అందం, ఆరోగ్యం రెండూ మీ సొంతం..
ఆకు కూరల్లో పాలకూర కూడా ఒకటి. పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. ఎక్కువగా విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. పాలకూర మాత్రమే కాకుండా వీటి రసం తాగడం వల్ల కూడా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాలకూర రసం తాగడం వల్ల ముఖ్యంగా కళ్ల ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఏ, గ్లాకోమా కంటి..