Chandrababu: సుప్రీంకోర్టులో ఏపీ సీఎం చంద్రబాబుకు ఊరట.. వివరాలు ఇవిగో
సుప్రీం కోర్టులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊరట లభించింది. స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టి వేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీట్ ఫైల్ చేశారని.. ఆ వివరాలు
సుప్రీం కోర్టులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊరట లభించింది. స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టి వేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు వెల్లడించారు.
ఛార్జిషీట్ దాఖలు చేసినందున బెయిల్ రద్దు పిటిషన్‌లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు జస్టిస్ బేలా త్రివేది . గత ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అవసరం అయిన సందర్భంలో విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సుప్రీం కోర్టు సూచించింది. 2023 నవంబరులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ దాఖలు చేసిన స్వర్ణాంధ్ర పత్రిక విలేకరి బాల గంగాధర్ తిలక్‌పై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరెవరు..? మీకేం సంబంధం..? పిల్ దాఖలు చేయడానికి ఉన్న అర్హత ఏంటి..? అని ప్రశ్నించింది. బెయిల్ వ్యవహారాల్లో మూడో వ్యక్తి ఎందుకు ఉంటారని ధర్మాసనం నిలదీసింది. సంబంధం లేని బెయిల్ వ్యవహారాల్లో పిటిషన్ ఎలా వేస్తారని జస్టిస్ బేలా త్రివేది ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి