AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramya Krishna Awards: శివగామి పాత్రకు 7.. ఇతర పాత్రలకు మరో 7.. రమ్యకృష్ణ అవార్డులు..

రమ్యకృష్ణ ఈమె పేరు తెలియని వారుండరు. నీలాంబరి నుంచి రాజమాత శివగామి దేవి వరుకు అనే పాత్రలకు ప్రాణం పోసిన నటి ఆమె. తన నటనతో ప్రేక్షకలోకాన్ని ఆకట్టుకున్నారు ఆమె. ఆమె నటనకు చాలామంది అభిమానులు ఉన్నారు. అయితే ఆమె నటనకి చాల అవార్డులు కూడా అందుకున్నారు మన రాజమాత.. ఆ అవార్డులు ఏంటి.? ఏ సినిమాలకు లభించాయి.? ఈరోజు చూద్దాం.. 

Prudvi Battula
| Edited By: Rajeev Rayala|

Updated on: Jan 15, 2025 | 2:43 PM

Share
1998లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన తెలుగు డ్రామా సినిమా కంటే కూతుర్నే కనాలి సినిమాలో నటనకి నంది అవార్డ్స్ వేడుకలో స్పెషల్ జ్యూరీ అవార్డు గెలుచుకున్నారు రమ్య కృష్ణ. ఇది ఆమె అందుకున్న తొలి అవార్డు. 

1 / 6
1999లో పాడయప్ప (తెలుగులో నరసింహ) చిత్రంలో నీలాంబరి పాత్రలో ఆమె నటనకి తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డుల వేడుకలో స్పెషల్ అవార్డుతో పాటు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ వారిచే  ఉత్తమ నటి - తమిళం అవార్డు అందుకున్నారు. 

2 / 6
తర్వాత 2009లో హీరో సిద్దార్డ్ తల్లిగా నటించిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాకి 57వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ సహాయ నటి - తెలుగు అవార్డు గెలుచుకున్నారు ఆమె. అదే ఏడాది రాజు మహారాజు సినిమాకి ఉత్తమ సహాయ నటి అవార్డ్స్ అందుకున్నారు.

3 / 6
 తర్వాత 2015లో బాహుబలి 1: ది బిగినింగ్ సినిమాలో ఆమె పోషించిన రాజా మాత శివగామి దేవి పాత్రకు 5 అవార్డులు కైవసం చేసుకున్నారు.  ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు 1, ఆనంద వికటన్ సినిమా అవార్డు 1, 1వ IIFA ఉత్సవంలో 2 (తెలుగు, తమిళం), ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ 1 అందుకున్నారు. 

4 / 6
 అలాగే 2017లో బాహుబలి 2: ది కన్‎క్లూజన్‎లో శివగామి దేవి పాత్రకు ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ 1,  బిహైండ్‌వుడ్స్ గోల్డ్ మెడల్ అవార్డు అందుకున్నారు. బాహుబలి రెండు పార్టుల్లో ఆమె నటనకి 7 అవార్డులు కైవసం చేసుకున్నారు.

5 / 6
తర్వాత సూపర్ డీలక్స్ సినిమాలో ఆమె కనబరిచిన నటనకి ఉత్తమ సహాయ నటి - ఫిమేల్ కేటగిరిలో  జీ సినీ అవార్డ్ (తమిళం), ఆనంద వికటన్ సినిమా అవార్డు అందుకున్నారు. ఇతర సినెమాలు మరో నాలుగు అవార్డులకు నామినేట్ అయ్యారు. కానీ అవి ఈమెను వరించలేదు. 

6 / 6