- Telugu News Photo Gallery Cinema photos Which movies are buzzed with updates on the occasion Sankranthi?
Movie Updates: సంక్రాంతి వేళ అప్డేట్ల సందడి.. ఆ సినిమాలు ఏంటి.?
సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో గేమ్ చెంజర్, డాకు మహారాజ్, సంక్రాంతి వస్తున్నాం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ మూడు సినిమాలు పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతున్నాయి. ఇదిలా ఉంటె త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న కొన్ని సినిమాలు అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. ఆ సినిమాలు ఏంటి.? ఎప్పుడు రానున్నాయి.? ఎప్పుడు చూద్దాం రండి..
Updated on: Jan 15, 2025 | 1:15 PM

ప్రభాస్, మారుతి కాంబోలో ‘ది రాజాసాబ్’ ఏప్రిల్ 10న ప్రేక్షకులను అలరించనుందని తెలిసిన విషయమే. రొమాంటిక్ కామెడీ హారర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్. రిద్ధి కుమార్ ఓ పాత్రలో నటిస్తుంది. ఇదిలా ఉంటె సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం నుంచి ప్రభాస్ మరో వదిలారు మేకర్స్. ఇది చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ ఎమున్నాడ్రా మా అన్న అంటూ కామెంట్స్ పెడుతూ షేర్ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కితున్న పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఇందులో నిధి అగర్వాల్ పవర్ స్టార్ సరసన నటిస్తుంది. సంక్రాంతి పండగ వేళ ఈ సినిమా నుంచి ‘మాట వినాలి’ అనే సాంగ్ ప్రోమో విడుదల చేశారు మేకర్స్. ఈ నెల 17న ఉదయం 10:20కి ఫుల్ సాంగ్ రానుంది. ఈ పాటను స్వయంగా పవన్ కళ్యాణ్ ఆలపించడం విశేషం. గతంలో కూడా కొన్ని పాటలు పాడారు పవన్.

హుంబాలే ఫిలిమ్స్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఇండియన్ ఎపిక్ యానిమేటెడ్ డ్రామా చిత్రం ‘మహావతార్ నరసింహ’. అనౌన్స్మెంట్ సమయంలో మంచి క్రజ్ తెచ్చుకుంది ఈ చిత్రం. తాజాగా మంగళవారం సంక్రాంతి పురస్కరించుకొని ఈ సినిమా టీజర్ విడుదల చేసింది మూవీ టీమ్. ఈ యానిమేటెడ్ టీజర్ ఐ ఫీస్ట్ అనిపించింది. ఈ సినిమా ఏప్రిల్ 3 థియేటర్లలో రానున్నట్లు ప్రకటించారు.

నెల్సన్ దిలీప్ కుమార్, రజినీకాంత్ కాంబోలో వచ్చిన ‘జైలర్’ ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీకి సీక్వెల్ కూడా రానుంది. ఇది మనకు తెలిసిందే. అయితే సంక్రాంతి రోజున ఈ చిత్రాన్ని ఆఫీసియల్గా అనౌన్స్ చేశారు మేకర్స్. దీని కోసం ఓ వీడియో కూడా రిలీజ్ చేసింది చిత్రబృందం.

విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘లైలా’. ఇందులో తొలిసారి లేడీ గెటప్‌లో కనిపిస్తున్నారు మాస్ కా దాస్. ఫిబ్రవరి 14న ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన లుక్స్ ఆకట్టుకున్నాయి. ఇదిలా సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ టీజర్ అనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ నెల 17న ఈ సినిమా టీజర్ రానుంది.




