- Telugu News Photo Gallery Cinema photos Darshan Celebrates Sankranti with Family After Bail In Renukaswamy murder case, See photos
Darshan: బెయిల్ తర్వాత మొదటి పండగ.. ఫ్యామిలీతో కలిసి సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్న దర్శన్.. ఫొటోస్
రేణుకాస్వామి హత్య కేసులో బెయిల్ లభించిన తర్వాత నటుడు దర్శన్ తన కుటుంబంతో కలిసి మైసూర్‌లోని తన ఫామ్‌హౌస్‌లో సంక్రాంతి వేడుకలను జరుపుకొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో దర్శన్ భార్య విజయలక్ష్మి, కుమారుడు వినీష్ ఉన్నారు
Updated on: Jan 15, 2025 | 12:45 PM

కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగుదీప గత ఆరు నెలలుగా ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడు. రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయి ఎన్నో కష్టాలు పడ్డాడు. ఇప్పుడు ఈ కేసులో దర్శన్ బెయిల్‌పై బయటకు వచ్చాడు.

దర్శన్ మైసూర్‌లోని తన ఫామ్‌హౌస్‌లో సంక్రాంతిని జరుపుకున్నారడు. ఈ వేడుకలో అతని కుటుంబ సభ్యులు కూడా భాగమయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ ఫొటోల్లో దర్శన్ తన భార్య విజయలక్ష్మి, కుమారుడు వినీష్‌తో కలిసి కనిపించారు. ఈ ఫోటోలు దర్శన్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. చాలా మంది హ్యాపీ ఫ్యామిలీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అలాగే దర్శన సోదరుడు దినకర్ కూడా ఈ ఫొటోల్లో కనిపించాు. కుటుంబ సభ్యులందరినీ ఇలా ఒకే ఫ్రేమ్‌లో చూడడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ చాలా రోజుల పాటు జైలులో ఉండిపోయాడు. అయితే గతేడాది డిసెంబర్ 13న ఈ నటుడికి బెయిల్ మంజూరైంది.




