AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam: పవిత్ర శ్రీశైలం ఆలయంలో ఇంటి దొంగల చేతివాటం.. 8 మంది సిబ్బంది పై సస్పెన్షన్‌ వేటు

శ్రీశైల దేవస్థానం టోల్గేట్ వద్ద విధులు నిర్వహిస్తున్న 8 మంది సిబ్బందిపై ఆలయ ఈవో సస్పెన్షన్‌ వేటు వేశారు. ఆలయ ఆకస్మిక తనిఖీల్లో సిబ్బంది వద్ద అదనపు డబ్బును గుర్తించిన అధికారులు ఈ మేరకు క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. విచారణ జరిపి ఈవోకు నివేదిక అందించడంతో ఎనిమిది మందిపై ఆలయ ఈవో శ్రీనివాసరావు సస్పెన్షన్‌ వేటు వేశారు..

Srilakshmi C
|

Updated on: Jan 14, 2025 | 7:02 PM

Share

నంద్యాల, జనవరి 14: నంద్యాల జిల్లా శ్రీశైల మహా క్షేత్రంలో టోల్గేట్‌లో అవకతవకలకు పాల్పడిన ఉద్యోగులపై వేటు పడింది. శ్రీశైలం టోల్గేట్ విధులు నిర్వహిస్తున్న 8 మంది సిబ్బందిని అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. టోల్ గేట్ లో ఉండాల్సిన డబ్బు కంటే అధికంగా డబ్బు ఉన్నట్లు అధికారులు గుర్తించి చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీశైలంకు వచ్చే ప్రతి వాహనం నుంచి దేవస్థానం ఏర్పాటు చేసిన టోల్గేట్ వద్ద వాహనదారుల నుంచి రుసుము వసూలు చేస్తారు. అయితే దేవస్థానం అధికారులు ఈనెల 5 తేదీన ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా సిబ్బంది దగ్గర ఉండాల్సిన డబ్బు కంటే అధికంగా డబ్బు ఉన్నట్లు గుర్తించారు. టోల్‌గేట్ సిబ్బంది వద్ద అదనంగా రుసుము ఉండడంతో విచారణ చేపట్టారు.

టోల్గేట్ లో విధులు నిర్వహిస్తున్న రెగ్యులర్ ఉద్యోగి ఎం రామకృష్ణుడుతోపాటు కాంట్రాక్టు సిబ్బంది బి నాగ పరమేశ్వరుడు, జి మల్లికార్జున రెడ్డి, ఎన్ గోవిందు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు మల్లికార్జున రెడ్డి, బీఆర్‌ మల్లేశ్వర్ రెడ్డి, డైలీ వేజ్ సిబ్బంది టోల్గేట్ ఇంచార్జ్ అధికారి శ్రీనివాసరావులపై నివేదిక తయారుచేసిన అధికారులు.. దానిని ఆలయ ఈవో శ్రీనివాసరావుకు అందజేశారు. ఈవో శ్రీనివాసరావు నివేదికను పరిశీలించి 8 మందిని వీధుల నుంచి తొలగించాలని ఉత్తర్వులు జారీ చేశా. వారి స్థానంలో ఇతర సిబ్బందిని టోల్గేట్‌లో నియమించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
పవన్‌కు లవర్‌గా..మహేష్‌కు అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరంటే?
పవన్‌కు లవర్‌గా..మహేష్‌కు అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరంటే?
అద్భుతం.. చీర కట్టుకున్నట్లుగా విరబూసిన మే పుష్పాలు!
అద్భుతం.. చీర కట్టుకున్నట్లుగా విరబూసిన మే పుష్పాలు!
గ్రహాంతరవాసుల స్థావరమా?అక్కడ చూస్తున్న భారీ కన్నుపై నాసా క్లారిటీ
గ్రహాంతరవాసుల స్థావరమా?అక్కడ చూస్తున్న భారీ కన్నుపై నాసా క్లారిటీ
కాసేపట్లో తాళికట్టాల్సి ఉంది.. అంతలోనే ఆగిన పెళ్లి..
కాసేపట్లో తాళికట్టాల్సి ఉంది.. అంతలోనే ఆగిన పెళ్లి..
ప్రేమించిన అమ్మాయికి నా కళ్ల ముందే పెళ్లి.. ఆ బాధతో నేను..
ప్రేమించిన అమ్మాయికి నా కళ్ల ముందే పెళ్లి.. ఆ బాధతో నేను..
పెరిగిన 5 కిలోల సిలిండర్ ధరలు.. ఒకేసారి భారీగా పెంపు..
పెరిగిన 5 కిలోల సిలిండర్ ధరలు.. ఒకేసారి భారీగా పెంపు..
మనీ ప్లాంట్ సీక్రెట్స్.. ఈ తప్పులు చేశారో తిప్పలు తప్పవు..
మనీ ప్లాంట్ సీక్రెట్స్.. ఈ తప్పులు చేశారో తిప్పలు తప్పవు..
బుధుడి అస్తమయం.. వీరికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే!
బుధుడి అస్తమయం.. వీరికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే!
లక్నోలో అన్యాయం జరిగింది.. ముంబైలో అవకాశం వచ్చింది
లక్నోలో అన్యాయం జరిగింది.. ముంబైలో అవకాశం వచ్చింది
రాత్రికి రాత్రే జాతకం మారే రాశులివే..ఇక వీరి దశ తరిగినట్లే!
రాత్రికి రాత్రే జాతకం మారే రాశులివే..ఇక వీరి దశ తరిగినట్లే!