గూగుల్ మ్యాప్‌ని నమ్ముకుని వెళ్తే.. పోలీసులకు ఊహించని షాక్..

గూగుల్ మ్యాప్‌ని నమ్ముకుని వెళ్తే.. పోలీసులకు ఊహించని షాక్..

Phani CH

|

Updated on: Jan 15, 2025 | 2:07 PM

ఇటీవల ప్రజలకు గూగుల్‌ మ్యాప్‌ చుక్కానిగా మారింది. ఎక్కడికి వెళ్లాలన్నా అందరూ గూగుల్‌ మ్యాప్‌నే నమ్ముకుంటున్నారు. సాధారణ పౌరులే కాదు.. పోలీసు అధికారులూ గూగుల్‌ మ్యాప్‌పై ఆధారపడుతున్నారు. అదే వారి కొంప ముంచింది. నిందితుడిని పట్టుకునేందుకు గూగుల్ మ్యాప్‌ను నమ్ముకున్న అసోం పోలీసులకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

గూగుల్ మ్యాప్‌ను అనుసరించిన పోలీసులు నాగాలాండ్‌లోని మోకోక్‌చుంగ్ జిల్లా చేరుకున్నారు. వీరిని చూసిన స్థానికులు అనుమానించి దాడి చేయడమే కాకుండా రాతంత్రా బందీలుగా ఉంచుకున్నారు. అసోంలోని జోరాత్ జిల్లాకు చెందిన 16 మందితో కూడిన పోలీసు బృందం నిందితుడిని పట్టుకునేందుకు బయలుదేరింది. ఈ క్రమంలో ఈ బృందం గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుంది. మ్యాప్ అసోంలోని ఓ తేయాకు తోటను చూపించింది. నిజానికి అది నాగాలాండ్‌లోని ప్రాంతం. అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడి కోసం లోపలికి వెళ్లారు. అయితే, వారి వద్దనున్న అధునాతన ఆయుధాలు చూసిన స్థానికులు వారిని దుండగులుగా పొరబడి చుట్టుముట్టి దాడి చేశారు. ఆపై వారిని బంధించారు. ఈ ఘటనలో ఒక పోలీసు గాయపడ్డారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అరటి పండ్ల ఎగుమతికి ఏకంగా రైలునే వేశారు.. ఆ బనానా ట్రైన్ స్పెషల్ ఇదే

గొంతులో 22 కత్తులను దింపి గిన్నీస్‌ రికార్డు కొట్టాడు.. కానీ..

TOP 9 ET News: సంక్రాంతిని మడతెట్టిన వెంకీ | 2nd డే దిమ్మతిరిగే వసూళ్లు డాకు విశ్వరూపం