AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Game Changer: లోకల్ టీవీ ఛానెల్స్ లో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా.. టాలీవుడ్ నిర్మాత తీవ్ర ఆగ్రహం

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద రూ.186 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమాను పైరసీ వెంటాడుతోంది.

Game Changer: లోకల్ టీవీ ఛానెల్స్ లో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా.. టాలీవుడ్ నిర్మాత తీవ్ర ఆగ్రహం
Game Changer Movie
Basha Shek
|

Updated on: Jan 15, 2025 | 2:20 PM

Share

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజ్ సినిమాను పైరసీ భూతం వెంటాడుతోంది. ఇప్పటికే పలు పైరసీ సైట్లలో గేమ్ ఛేంజర్ హెచ్ డీ వెర్షన్ కనిపిస్తోంది. ఇటీవల ఓ బస్సులోని టీవీలోనూ ఈ సినిమాను టెలికాస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట వైరలయ్యాయి. దీంతో చిత్రబృందం సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు చేసింది. విడుదలకు రెండు రోజుల ముందు కీలక సన్నివేశాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారని.. సినిమా విడుదల కాగానే ఆన్‌లైన్‌లో లీక్‌ చేశారని మూవీ టీమ్‌ ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇంత జరుగుతున్నా పైరసీ మాత్రం ఆగడం లేదు. తాజాగా ఒక లోకల్ ఛానెల్ లో గేమ్ ఛేంజర్ సినిమాను ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో పైరసీ వ్యవహారం మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిది. దీనిపై ప్రముఖ నిర్మాత, బేబీ ఫేమ్ ఎస్‌కేఎన్( శ్రీనివాస కుమార్‌) ఘాటుగా రియాక్ట్ అయ్యారు. వేలమంది శ్రమ దాగి ఉన్న సినిమాను వారం రోజులు కాకముందే టీవీలోని లోకల్ ఛానెల్ లో టెలికాస్ట్ చేయడంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా అభ్యర్థించారు

‘ఇది ఏమాత్రం సహించదగినది కాదు. గేమ్ ఛేంజర్ సినిమా విడుదలై కేవలం 4-5 రోజులు మాత్రమే గడచింది. అప్పుడే సినిమాను స్థానిక కేబుల్ ఛానల్స్, బస్సులలో ప్రసారం చేస్తున్నారు. ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశం. సినిమా అనేది కేవలం హీరో, దర్శకుడు, నిర్మాతల గురించి మాత్రమే కాదు. ఎంతోమంది మూడు, నాలుగు ఏళ్ల కృషి, వారి అంకితభావం, వేలాది మంది శ్రమ దాగి ఉంది. ఈ సినిమా విజయంపై ఆధారపడిన డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ ఈ ప్రభావం ఎంత ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి చర్యలు వారి కష్టాన్, శ్రమను తీవ్రంగా దెబ్బతీయడమే కాదు.. సినిమా ఇండస్ట్రీ భవిష్యత్తుకు ప్రమాదకరంగ కూడ మారుతాయి. పైరసీ విషయంపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమాను రక్షించడానికి.. సినిమా ఇండస్ట్రీ భవిష్యత్తు కోసం ‍మనందరం ఐక్యంగా నిలబడి పోరాడుదాం.’ అని పిలుపునిచ్చారు ఎస్కేఎన్. తన పోస్టుకు ‘సేవ్‌ది సినిమా’ అని హ్యాష్‌ ట్యాగ్ కూడా‌ జత చేశారు

ఇవి కూడా చదవండి

ప్రొడ్యూస్ ఎస్కేఎన్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..