EPFO ద్వారా నెలకు రూ. 7500 పింఛన్ వస్తుందా..?

TV9 Telugu

15 January 2025

పని చేసే ఉద్యోగుల కోసం పెన్షన్ పథకం రూపొందించింది కేంద్రం ప్రభుత్వం. ఇది పదవీ విరమణ తర్వాత సహాయపడుతుంది.

ప్రస్తుతం ఉద్యోగులకు రూ.1000 పింఛన్‌ వస్తోంది. నెలకు రూ.7,500కు పెంచాలని డిమాండ్ చేశారు. బడ్జెట్‌లో చేర్చాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు.

దేశంలోని 78 లక్షల మంది ఉద్యోగులు ఈపీఎఫ్‌వో పథకంలో చేరారు. వీరిలో ప్రభుత్వ, ప్రైవేట్, ఫ్యాక్టరీల ఉద్యోగులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ పింఛను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

2014లో కనీస పింఛను రూ.1000గా నిర్ణయించారు. కానీ కొన్నేళ్లుగా ద్రవ్యోల్బణం పెరగడం వల్ల అవసరాలకు ఈ మొత్తం సరిపోవడం లేదు.

మూడు నెలల పాటు కొత్త ఉద్యోగాలకు ప్రభుత్వం 12% డిపాజిట్ చేస్తుంది. ఇందులో కంపెనీ, ఉద్యోగి ఇద్దరికీ వాటా ఉంటుంది.

కొందరు ఉద్యోగులు తమ పింఛను రూ.5వేలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. రూ.1000తో వైద్యం, ఇంటి ఖర్చులు భరించడం కష్టమని అంటున్నారు.

పింఛను పెంచాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. ప్రభుత్వం వీలైనంత త్వరగా పింఛను పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

రూ.7,500 పింఛన్‌తో లక్షల కుటుంబాలకు ఉపశమనం లభిస్తుంది. కనీస పింఛన్ పథకంపై కేంద్రం కసరత్తు మొదలు పెట్టినట్టు సమాచారం.