యాలకులతో పటిక బెల్లం కలిపి తింటే ఏమవుతుందో తెలుసా? 

14 January 2025

TV9 Telugu

TV9 Telugu

యాలకుల్ని మనం తీపి పదార్థాల తయారీలో ఎక్కువగా వాడుతుంటాం. చక్కటి సువాసన కలిగి అదనపు రుచి తెచ్చే వీటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి

TV9 Telugu

యాలకుల్లో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును అదుపు చేస్తాయి. క్యాన్సర్‌ కారక కణాలు పెరగకుండా నిరోధిస్తాయి. వీటిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి

TV9 Telugu

వ్యాధినిరోధకశక్తిని పెంచుతాయి. ఆరోగ్యకరమైన కణాల అభివృద్ధికి తోడ్పడతాయి. భోజనం చేసిన తరువాత రెండు యాలకులను నోట్లో వేసుకుంటే చాలు. తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమవుతుంది. వీటికి జీర్ణశక్తిని మెరుగుపరిచే గుణం మెండుగా ఉంది

TV9 Telugu

వికారం, వాంతి వచ్చినట్లు అనిపిస్తే రెండు యాలకులు తిని చూడండి. ఫలితం మీకే తెలుస్తుంది. యాలకుల్లో ఉండే ఔషధగుణాలు చెడు బ్యాక్టీరియాతో పోరాడతాయి. ఇవి నోటి దుర్వాసన తగ్గించి చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి

TV9 Telugu

అందుకే యాలకులను టీ నుంచి వంట వరకు ప్రతిదానిలో మసాలాగా విస్తృతంగా వినియోగిస్తారు. యాలకుల్లో ఉండే విటమిన్ సి, నియాసిన్, మినరల్స్, కాల్షియం, పొటాషియం, రైబోఫ్లావిన్ వంటి పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి

TV9 Telugu

అయితే యాలకులతో పటిక బెల్లం కలిపి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. యాలకులు, పటిక బెల్లం మిశ్రమం జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి

TV9 Telugu

వీటిని తీసుకోవడం వల్ల అజీర్ణం, మలబద్ధకం వంటి తీవ్రమైన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఈ రెండింటిని కలిపి తినడం వల్ల శరీరంలో బలహీనత సమస్య తొలగిపోతుంది. ఇది రక్త హీణతను కూడా భర్తీ చేస్తుంది

TV9 Telugu

పటిక బెల్లం, యాలకులు కలిపి రోజూ ఉదయాన్నే తినడం వల్ల బరువు వేగంగా తగ్గవచ్చు. ఈ రెండింటి మిశ్రమంలో ఉండే గుణాలు నోటి పూతల వల్ల కలిగే అసౌకర్యాన్ని తొలగించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది