పట్టులాంటి మెరిసే చర్మం కోసం.. ఈ చేపలు తింటే బెటర్..!
15 January 2025
Jyothi Gadda
TV9 Telugu
సాల్మన్ చేపలు మహిళలకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. ఈ చేపల్లో అధికంగా ఉండే ఓమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు, ప్రోటీన్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
TV9 Telugu
సాల్మన్‌లో ఉన్న ఓమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు గర్భిణీలకు మంచిది.. ఇది శిశువు మెదడు, నాడీ వ్యవస్థ అభివృద్ధి కి ఎంతో అవసరమైనవి. గర్భస్థ శిశువు మెదడు ఎదుగుదలకు మేలు చేస్తుంది.
TV9 Telugu
సాల్మన్ తినడం ద్వారా మహిళలలో హృదయ సంబంధ సమస్యలను తగ్గించవచ్చు. ఓమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కోలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
TV9 Telugu
సాల్మన్‌లో విటమిన్ D అధికంగా ఉండడం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది శరీరానికి అవసరమైన కాల్షియంను ఆకర్షించడంలో సహాయపడుతుంది.
TV9 Telugu
సాల్మన్‌లోని ఓమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడతాయి. దీని వల్ల ఆర్థరైటిస్ వంటి వ్యాధులు ఉన్న మహిళలకు తక్షణ ఉపశమనం లభిస్తుంది.
TV9 Telugu
సాల్మన్‌లోని ఓమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు మరియు B12 విటమిన్ మెదడు ఆరోగ్యానికి కీలకం. ఇవి మెమరీ పవర్ పెరగడానికి, అలాగే నిరాశ, ఆందోళన వంటి మానసిక సమస్యల నివారిస్తుంది.
TV9 Telugu
సాల్మన్‌లోని పోషకాలు, ముఖ్యంగా అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్, విటమిన్ E, ఓమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు చర్మం ఆరోగ్యానికి మంచిది. చర్మ సమస్యలను తగ్గించి,వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది.
TV9 Telugu
సాల్మన్ తక్కువ కార్బోహైడ్రేట్, అధిక ప్రోటీన్, ఫ్యాట్ కంటెంట్ కారణంగా కీటో డైట్ తీసుకునే మహిళలకు మంచిది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది, శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఫ్యాట్లు అందిస్తుంది.