జపాన్ బుల్లెట్ రైళ్లకు పొడవైన ముక్కులు.! ఎందుకని ఆలోచించారా.?

TV9 Telugu

15 January 2025

భారతదేశంలో 2027 సంవత్సరం నుండి ముంబై - అహ్మదాబాద్ మధ్య జపాన్ షింకన్సెన్ బుల్లెట్ రైలును నడపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

జపాన్‌ దేశానికి చెందిన బుల్లెట్ రైలుకు ఇంత పొడవైన ముక్కు ఆకారంలో ఎందుకు ఉందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

జపాన్ దేశం బులెట్ రైళ్లలో ఉన్న పొడవాటి ముక్కు ఆకారం వేగానికి సంబంధించినదని చాలామంది ప్రజలు అనుకుంటారు.

కానీ చైనా దేశం బుల్లెట్ రైలు అత్యంత వేగవంతమైన రైలుగా పేరు పొందింది. దీనికి అంత పొడవైన ముక్కు ఆకారం మాత్రం లేదు.

రైలు వల్ల వచ్చే శబ్దాన్ని తగ్గించే విధంగా జపాన్‌కు చెందిన బుల్లెట్ రైలుకు అలాంటి డిజైన్ తయారు చేయడం జరిగింది.

పొడవాటి ముక్కు ఆకారం లేకపోతే, బుల్లెట్ రైలు గంటకు 320 కి.మీ వేగంతో సొరంగం గుండా వెళుతున్నప్పుడు, అది చాలా పెద్దం శబ్దం చేస్తుంది.

1970ల నాటి బుల్లెట్ రైలు సొరంగం నుండి బయటకు వచ్చినప్పుడు, సమీపంలోని ఇళ్ల కిటికీలకు గాజు పగుళ్లు ఏర్పడ్డాయట.

పొడవైన ముక్కు ఆకారం ఒక ప్రయోజనం ఏమిటంటే ఇది రైలులో గాలి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది శక్తిని ఆదా చేయడంలో సహాయపడుతుంది.