విటమిన్ బి12 పోషకాన్ని 'కోబాలమిన్' అని కూడా అంటారు. సాధారణంగా విటమిన్ బి12 లోపం శరీరంలో ఇతర విటమిన్లు, ఐరన్ లోపానికి దారి తీస్తాయి. ఈ విటమిన్ లోపం ఉంటే శరీరంలోని నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది రక్తహీనత, నరాల సంబంధిత సమస్యలు, ఎముకలు, కండరాల బలహీనతకు కూడా కారణమవుతుంది. దీన్ని నివారించడానికి, శీతాకాలంలో లభించే కొన్ని ముఖ్య కూరగాయలను తీసుకోవడం అవసరం.