కాలీఫ్లవర్‌ తినడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

ప్రజలు కాలీఫ్లవర్ వెజిటేబుల్‌తో కూర, ఫ్రై, పకోడి వంటి వివిధ రకాల వంటకాలను తయారు చేసి తినడానికి ఇష్టపడతారు. ఇది ఉడికించడం చాలా సులభం. ఇది మెత్తగా ఉడికించటానికి ఎక్కువ వేడి అవసరం లేదు. ఇక, కాలీఫ్లవర్ చూడడానికి ఎంత అందంగా ఉంటుందో ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుంది. ఇందులో మన ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు ఉన్నాయి. అలాంటి కాలీఫ్లవర్‌ వల్ల నష్టాలేంటి అనే సందేహం కలుగుతుంది కదూ..! గ్రేటర్ నోయిడాలోని జిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ప్రఖ్యాత డైటీషియన్ డాక్టర్ ఆయుషి యాదవ్ కాలీఫ్లవర్‌ని ఎందుకు ఎక్కువగా తినకూడదో వివరించారు.

Jyothi Gadda

|

Updated on: Feb 13, 2024 | 5:27 PM

కాలీఫ్లవర్‌లో రాఫినోస్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఒక రకమైన కార్బోహైడ్రేట్. దీన్ని మన శరీరం సహజంగా విచ్ఛిన్నం చేయలేకపోతుంది. ఇది చిన్న ప్రేగు ద్వారా పెద్ద ప్రేగులకు వెళుతుంది. దీంతో పొట్టలో గ్యాస్‌ సమస్య మొదలవుతుంది.

1 / 5
కిడ్నీ స్టోన్ విషయంలో పొరపాటున కూడా కాలీఫ్లవర్ తినకూడదు. ఇందులో క్యాల్షియం అధిక పరిమాణంలో ఉంటుంది. ఇది రాళ్ల సమస్యను పెంచుతుంది. అందుకే కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు కాలీఫ్లవర్‌కు దూరంగా ఉండాలి.

2 / 5
థైరాయిడ్ సమస్య ఉన్నవారికి, కాలీఫ్లవర్ వినియోగం హానికరం. ఇది రోగులకు అస్సలు మంచిది కాదు. అందుకే థైరాయిడ్ సమస్య తో బాధపడే వాళ్ళు కాలీఫ్లవర్ తీసుకోకూడదు. ఎందుకంటే కాలిఫ్లవర్‌ని తినడం వల్ల టి3 టి4 హార్మోన్లు విపరీతంగా పెరిగిపోతాయి. దీంతో థైరాయిడ్ సమస్యతో బాధ పడే వాళ్ళకి మరింత ఇబ్బంది కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

3 / 5
కాలీఫ్లవర్‌ అతిగా తినడం వల్ల పొట్టలో గ్యాస్ ఇంకా ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చలికాలంలో పొట్ట సమస్యలతో బాధపడుతున్న వారు వీటితో తయారు చేసిన ఆహార పదార్థాలు తినకపోవడం మంచిది. అయితే ఇది యూరిక్ యాసిడ్ సమస్యలకు కూడా దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మరీ ఎక్కువగా తినకుండా మితంగా తినండి.

4 / 5
కీళ్లలో నొప్పి, వాపు, యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు కాలీఫ్లవర్ తినకూడదు. ఎందుకంటే ఇది సమస్యని మరింత పెంచుతుది. కాలీఫ్లవర్ తినడం వల్ల రక్తం చిక్కగా మారుతుంది. రక్తానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే కాలీఫ్లవర్ తినకుండా ఉండాలి. పాలిచ్చే స్త్రీలు కాలీఫ్లవర్ తినకుండా ఉండాలి. . దీనివల్ల తల్లి పాలు తాగే పిల్లలకు కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది.

5 / 5
Follow us