- Telugu News Photo Gallery Ghee for Healthy Hair: Why You Should Apply Ghee To Hair In Winter, Know here
Ghee for Healthy Hair: ఇది జుట్టును ఒక్క నెలలోనే అంగుళం పెంచుతుంది.. మీరూ ట్రై చేయండి
వేడి వేడి అన్నంలో నెయ్యి కలిపి తింటే ఆ మజానే వేరు. అలాగే హల్వా, పరోటాలో నెయ్యి జోడించడం వల్ల రుచి మరింత పెరుగుతుంది. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఆహారంలో భాగంగా నెయ్యిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంతోపాటు అందం కూడా సొంతం చేసుకోవచ్చు. పొడి పెదవులు, పగిలిన మడమలకు చికిత్స అందించడంలో నెయ్యి ప్రభావవంతంగా పనిచేస్తుంది. నెయ్యి చర్మాన్ని తేమగా ఉంచుతుంది.
Updated on: Nov 24, 2023 | 11:51 AM

నెయ్యి జీర్ణం కావడం కష్టమని చాలా మంది చెబుతుంటారు. అందుకే చాలామంది నెయ్యితో చేసిన ఆహారాన్ని తినడానికి ఇష్టపడరు. రోజూ ఒక చెంచా నెయ్యి తీసుకుంటే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారు రోజూ నెయ్యి తింటే, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలను దూరం చేసుకోవచ్చు.

చలికాలంలో చర్మాన్ని సంరక్షించుకోవాలంటే నెయ్యి తప్పనిసరిగా తీసుకోవాలి. జుట్టు సంరక్షణకు కూడా నెయ్యి దోహదపడుతుంది. ముఖ్యంగా పొడి వాతావరణంలో నెయ్యి జుట్టు సంరక్షణకు ఉపయోగపడుతుంది.

Hair care tips

చలికాలంలో ఆస్తమా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జలుబు, గ్యాస్, అజీర్ణం వంటి అనేక ఇతర సమస్యలు తలెత్తుతాయి. ఈ కాలంలో యాంటీబయాటిక్స్ అధికంగా తీసుకోవడం శరీరానికి అంత మంచిది కాదు. అయితే ఈ యాంటీబయాటిక్ తీసుకున్న తర్వాత మీరు ఎక్కువ నీరు త్రాగాలి. శీతాకాలంలో కూడా తక్కువ నీళ్లు తక్కువగా తాగుతాం. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి.

శీతాకాలంలో జుట్టుకు డీప్ కండిషనింగ్ అవసరం. డీప్ కండిషనింగ్ ద్వారా జుట్టుకు అదనపు తేమ అందుతుంది. అందుకు నెయ్యి వేడి చేసి జుట్టుకు రాసుకోవాలి. ఇది సహజ పద్ధతిలో జుట్టును కండిషన్ చేస్తుంది. అలాగే తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. నెయ్యి తలకు పట్టించడం వల్ల జుట్టు పెరుగుతుంది. ఈ సహజ పదార్ధం మీ జుట్టును మందంగా, పొడవుగా పెరగడంలో సహాయపడుతుంది. నెయ్యిలో ఉండే ముఖ్యమైన పోషకాలు ఒక నెలలోనే జుట్టు అంగుళం పెరిగేలా చేస్తాయి.




