- Telugu News Photo Gallery Dry Fruits for Vitamin D: These 4 Vitamin D Rich Dry Fruits You Must Consume In Winter
Dry Fruits for Vitamin D: ఎండలోనే కాదు ఈ ఎండిన పండ్లలో కూడా ‘విటమిన్ డి’ అధికమే.. రోజూ కాసిన్ని తిన్నారంటే..
రోగ నిరోధకతను పెంచడంలో విటమిన్ సితోపాటు విటమిన్ డి కూడా కీలకపాత్ర పోషిస్తుంది. శరీరంలో విటమిన్ డి లోపం వల్ల తరచుగా జ్వరం వస్తుంది. విటమిన్ డి శరీరానికి అవసరమైన పోషకం. ఈ పోషకాల లోపం ఎముకలు, దంతాల సమస్యలకు కూడా దారితీస్తుంది. విటమిన్ డి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు ఎముకలు, దంతాల అభివృద్ధికి సహాయపడుతుంది. విటమిన్ డి ప్రధాన మూలం సూర్యకాంతి. కానీ శీతాకాలంలో సూర్యకాంతి తక్కువగా ఉంటుంది. ఈ కాలంలో శరీరంలో విటమిన్ డి లోపాన్ని భర్తీ చేయడానికి..
Updated on: Dec 24, 2023 | 12:01 PM

రోగ నిరోధకతను పెంచడంలో విటమిన్ సితోపాటు విటమిన్ డి కూడా కీలకపాత్ర పోషిస్తుంది. శరీరంలో విటమిన్ డి లోపం వల్ల తరచుగా జ్వరం వస్తుంది. విటమిన్ డి శరీరానికి అవసరమైన పోషకం. ఈ పోషకాల లోపం ఎముకలు, దంతాల సమస్యలకు కూడా దారితీస్తుంది. విటమిన్ డి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు ఎముకలు, దంతాల అభివృద్ధికి సహాయపడుతుంది.

విటమిన్ డి ప్రధాన మూలం సూర్యకాంతి. కానీ శీతాకాలంలో సూర్యకాంతి తక్కువగా ఉంటుంది. ఈ కాలంలో శరీరంలో విటమిన్ డి లోపాన్ని భర్తీ చేయడానికి ఎక్కువ పాలు, గుడ్లు తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.శరీరంలో విటమిన్ డి లోపాన్ని సప్లిమెంట్లతో పాటు ఆహారం ద్వారా కూడా భర్తీచేయవచ్చు.

కొన్ని సందర్భాల్లో డ్రై ఫ్రూట్స్ తినడం ద్వారా విటమిన్ డి లోపాన్ని భర్తీ చేయవచ్చు. ఎండిన అంజూరం పండ్లను తినడం వల్ల శరీరంలో విటమిన్ డి లోపాన్ని పూరించవచ్చు. అయితే వీటిని మితంగా తినాలి. ఇందులో కాల్షియం, పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.

ఎండిన ఆప్రికాట్లలో విటమిన్ డితో పాటు, విటమిన్ ఎ, పొటాషియం, ఫైబర్ అధికంగా ఉంటుంది. రోజూ ఒక ఎండు ఆప్రికాట్ పండు తింటే శరీరం దృఢంగా ఉంటుంది.

విటమిన్ సి, విటమిన్ డి రెండూ ఖర్జూరంలో ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం 4 ఖర్జూరాలు తినడం ద్వారా ఇన్ఫెక్షన్ నుంచి దూరంగా ఉండవచ్చు. అలాగే ఖర్చూరం తినడం వల్ల చలికాలంలో చర్మం తాజాగా ఉంటుంది. అలాగే ఎండుద్రాక్షలో విటమిన్ డి, కాల్షియం, ఫాస్పరస్ ఉంటాయి. ఐరన్ మరియు ఫైబర్ కూడా అందిస్తుంది. చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎండుద్రాక్ష ప్రత్యేక పాత్ర పోషిస్తుంది.




