- Telugu News Photo Gallery How to grow a banana tree in a pot at home, check here is details in Telugu
Banana Tree at Home: ఇంటి వద్దనే కుండీలో అరటి చెట్టును పెంచడం ఎలా..
అందరికీ అన్ని కాలాల్లో లభ్యమేయ్య పండు అరటి పళ్లు. సామాన్యులకు కూడా అతి తక్కువ ధరలో అరంటి పండు లభిస్తుంది. చిన్న పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చాలా అరటి మొక్క పెంచాలంటే ఎంతో కష్టం అనుకుంటారు. ఖాళీగా ఉండే ప్రదేశం కావాలి అనుకుంటారు. ఎందుకంటే అరటి చెట్టు పొడ్డుగా.. బరువుగా ఉంటుంది. కానీ అరటి చెట్టును ఇంట్లోనే కుండీలో..
Chinni Enni | Edited By: Ram Naramaneni
Updated on: Dec 24, 2023 | 8:42 PM

అందరికీ అన్ని కాలాల్లో లభ్యమేయ్య పండు అరటి పళ్లు. సామాన్యులకు కూడా అతి తక్కువ ధరలో అరంటి పండు లభిస్తుంది. చిన్న పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చాలా అరటి మొక్క పెంచాలంటే ఎంతో కష్టం అనుకుంటారు. ఖాళీగా ఉండే ప్రదేశం కావాలి అనుకుంటారు. ఎందుకంటే అరటి చెట్టు పొడ్డుగా.. బరువుగా ఉంటుంది. కానీ అరటి చెట్టును ఇంట్లోనే కుండీలో పెంచుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

ముందుగా మార్కెట్లో లభ్యమయ్యే అరటి చెట్టు విత్తనాలను తీసుకొచ్చి.. నీటిలో రెండు రోజుల పాటు నానబెట్టండి. ఇలా చేస్తే పిండం త్వరగా మొలకెత్తుతుంది. మంచి రకం అరటి విత్తనాలు తెచ్చుకోవాలి.

ఇప్పుడు ఒక కుండీ తీసుకోండి. మరీ చిన్నది కాకుండా కాస్త పెద్ద సైజులో ఉండేలా చూసుకోండి. దాని నిండా మట్టిని నింపండి. అరటి గింజలను 1/4 అంగుళాల లోతులో పెట్టండి. నేల తేమగా ఉండేంత వరకూ విత్తానలకు నీళ్లు పోయాలి.

ఈ విత్తనాలు మొలకెత్తడానికి సమయం పడుతుంది. కాబట్టి వేచి చూడాలి. విత్తనాలకు మంచి ఎరువులు జోడించండి. నత్రజని అధికంగా ఉండే ఎరువులతో.. చెట్టు బలంగా ఉంటుంది.

అరటి మొక్క పెరగాలంటే సూర్య కాంతి చాలా అవసరం. కాబట్టి ఈ మొక్క సూర్య కాంతిలో ఉండేలా చూసుకోండి. కుండీ కంటే మొక్క బాగా పెద్దగా పెరగడం ప్రారంభిస్తే.. ఆ మొక్కను పెద్ద కుండీ లేదా కంటైనర్ లో మార్చవచ్చు. ఇలా కొద్ది రోజుల్లోనే మీ కుండీలో అరటి పండ్లు వచ్చేస్తాయి.





























