- Telugu News Photo Gallery Diabetes Care: magnesium deficiency can cause type 2 diabetes eat these foods to lower risk
మధుమేహం రోగులకు అలర్ట్.. ఇది తగ్గితే టైప్ -2 డయాబెటిస్ ముప్పు.. ఇలా చెక్ పెట్టండి..!
మీ శరీరంలో ఈ ఖనిజం లోపం ఉంటే, మీరు కండరాల తిమ్మిరి, బలహీనత, అలసట, క్రమరహిత హృదయ స్పందన, ఒత్తిడి, నిద్రలేమి, వికారం, ఎముకలలో బలహీనత వంటి లక్షణాలను అనుభవించవచ్చు. మెగ్నీషియం లోపం డయాబెటిస్ తోపాటు చాలా ప్రమాదకరమైన వ్యాధులకు దారితీస్తుంది.
Updated on: Sep 01, 2024 | 1:40 PM

ప్రస్తుతకాలంలో డయాబెటిస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా లక్షలాది మంది దీని బారిన పడుతున్నారు. అయితే.. మధుమేహం సమస్య కేవలం చక్కెర లేదా కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారాల వల్ల మాత్రమే కాదు.. శరీరంలో మెగ్నీషియం లోపం కూడా టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఈ ఖనిజం ఎముకల ఆరోగ్యానికి మాత్రమే కాదు, శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా ప్రభావితం చేస్తుంది. మీ శరీరంలో మెగ్నీషియం లోపం ఉంటే, మీరు కండరాల తిమ్మిరి, బలహీనత, అలసట, క్రమరహిత హృదయ స్పందన, ఒత్తిడి, నిద్రలేమి, వికారం, ఎముకలలో బలహీనత వంటి లక్షణాలను అనుభవించవచ్చు. మెగ్నీషియం లోపం డయాబెటిస్ తోపాటు చాలా ప్రమాదకరమైన వ్యాధులకు దారితీస్తుంది. అయితే.. మెగ్నీషియం లోపాన్ని ఆహారంతో చెక్ పెట్టవచ్చు.. ఇక్కడ పేర్కొన్న ఈ 5 ఆహారాలు మెగ్నిషియం లోపాన్ని నియంత్రించడంలో డయాబెటిస్ ప్రమాదం నుంచి రక్షించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.. అవేంటో చూడండి..

బచ్చలికూర: బచ్చలికూర మెగ్నీషియానికి అద్భుతమైన మూలం. ఇది మీ శరీర ఆరోగ్యాన్ని కాపాడేలా అధిక మొత్తంలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది. సలాడ్, సూప్ లేదా కూరగాయల రూపంలో మీ ఆహారంలో బచ్చలికూరను చేర్చుకోవాలి.. తద్వారా మీరు అవసరమైన మెగ్నీషియం పొందవచ్చు.

బాదం: బాదంపప్పులో మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది కాకుండా, ఇది ఆరోగ్యకరమైన కొవ్వు, ప్రోటీన్ కు మంచి మూలం. ప్రతిరోజూ కొన్ని బాదంపప్పులను తినడం ద్వారా, మీరు మీ మెగ్నీషియం లోపాన్ని తీర్చవచ్చు.. మీ గుండె, రక్తంలో చక్కెర స్థాయిలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

గుమ్మడికాయ గింజలు: గుమ్మడికాయ గింజలు కూడా మెగ్నీషియం గొప్ప మూలం. మీరు వీటిని స్నాక్‌గా లేదా సలాడ్‌లో చేర్చుకోవచ్చు. గుమ్మడికాయ గింజల వినియోగం మెగ్నీషియం లోపాన్ని తీర్చడమే కాకుండా ఇతర పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది.

నల్ల బీన్స్ : నల్ల బీన్స్‌లో కూడా మెగ్నీషియం పెద్ద పరిమాణంలో ఉంటుంది. ఇవి ప్రోటీన్, ఫైబర్ కు మంచి మూలం. మీరు వీటిని సూప్, సలాడ్ లేదా అన్నంతో కలిపి మీ భోజనంలో చేర్చుకోవచ్చు.

అరటిపండు: అరటిపండు రుచితోపాటు.. మంచి పోషకాలతో నిండిఉంటుంది.. ఇందులో మెగ్నీషియం కూడా ఉంటుంది. ఈ పండు శక్తికి మంచి మూలం.. మీ శరీరం మెగ్నీషియం అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది. రోజుకు ఒక అరటిపండు తినడం వల్ల మీ మెగ్నీషియం వినియోగాన్ని పూర్తి చేసుకోవచ్చు.




