- Telugu News Photo Gallery Cricket photos IPL 2024: KKR All Rounder Sunil Narine Overtakes Lasith Malinga's Record
IPL 2024: లసిత్ మలింగ రికార్డును బద్దలు కొట్టిన సునీల్ నరైన్.. కట్‌చేస్తే.. ఆ స్పెషల్ లిస్టులో దూకుడు..
KKR All Rounder Sunil Narine: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( Indian Premier League 2024) చరిత్రలో ఒకే జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా సునీల్ నరైన్ రికార్డు సృష్టించాడు. 2012 నుంచి కేకేఆర్ తరపున ఆడుతున్న నరైన్ మొత్తం 172 వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు ముంబై ఇండియన్స్ తరపున 170 వికెట్లు తీసిన లసిత్ మలింగ పేరిట ఉంది.
Updated on: Apr 22, 2024 | 1:15 PM

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 36వ మ్యాచ్‌లో సునీల్ నరైన్ ప్రత్యేక రికార్డు సృష్టించాడు. లసిత్ మలింగ రికార్డును కూడా అధిగమించడం విశేషం.

ఆర్‌సీబీతో జరిగిన ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన నరైన్ 34 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ రెండు వికెట్లతో ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో సునీల్ నరైన్ 6వ స్థానానికి చేరుకున్నాడు.

అంతకు ముందు లసిత్ మలింగ 6వ స్థానంలో ఉన్నాడు. 122 ఐపీఎల్ మ్యాచుల్లో బౌలింగ్ చేసిన మలింగ మొత్తం 170 వికెట్లు పడగొట్టి ఈ రికార్డును లిఖించాడు.

సునీల్ నరైన్ 168 ఐపీఎల్ ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 172 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన 2వ విదేశీ బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో డ్వేన్ బ్రావో (183) అగ్రస్థానంలో ఉన్నాడు.

ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో యుజ్వేంద్ర చాహల్ అగ్రస్థానంలో ఉన్నాడు. చాహల్ 151 ఇన్నింగ్స్‌ల ద్వారా మొత్తం 199 వికెట్లు తీశాడు. ఇప్పుడిప్పుడే డబుల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్న చాహల్ ఒక్క వికెట్‌తో ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించనున్నాడు.




