- Telugu News Photo Gallery Cinema photos Tamil Heroes Suriya and Vikram focus on Tollywood With Kanguva and thangalaan Movies Telugu Heroes Photos
Kanguva Vs Thangalaan: తెలుగు మార్కెట్ మీద దృష్టి పెడుతున్న తమిళ్ హీరోలు.!
2024 సెకండ్ హాఫ్ మీద తమిళ సినిమా ఇండస్ట్రీ బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. అది జస్ట్ కోలీవుడ్ మార్కెట్‌కే పరిమితం అవుతుందా? టాలీవుడ్ బాక్సాఫీస్ మీద కూడా ప్రభావం చూపుతుందా.? నెవర్ బిఫోర్ అవతార్స్ లో విక్రమ్ అండ్ సూర్య దండయాత్రకు మేం సిద్ధం అంటున్నారు. ఈ కాన్సెప్ట్స్ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతాయా.? తంగలాన్‌లో విక్రమ్ కేరక్టర్‌ని చూసిన వారు.. అందులో ఉన్నది అసలు విక్రమేనా? అని ఆశ్చర్యపోతున్నారు.
Updated on: Jul 25, 2024 | 6:13 PM

తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది తంగలాన్. మరి ఈ సినిమా సెన్సార్ టాక్ ఏంటి.? విలక్షణ నటుడు విక్రమ్ లీడ్ రోల్‌లో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా తంగలాన్.

నెవర్ బిఫోర్ అవతార్స్ లో విక్రమ్ అండ్ సూర్య దండయాత్రకు మేం సిద్ధం అంటున్నారు. ఈ కాన్సెప్ట్స్ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతాయా.?

తంగలాన్‌లో విక్రమ్ కేరక్టర్‌ని చూసిన వారు.. అందులో ఉన్నది అసలు విక్రమేనా? అని ఆశ్చర్యపోతున్నారు. పీరియాడిక్ కథతో కేజీయఫ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ కథ కోసం అంతలా మారిపోయారు చియాన్.

తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది తంగలాన్. బ్రిటీష్ కాలంలో కర్ణాటకలోని కోలార్ ఫీల్డ్స్‌లో పనిచేసే కార్మికుల జీవితాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు పా రంజిత్.

మరి వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే.. తెలుగు ఆడియన్స్ కి నచ్చేలా తంగలాన్‌ని మేకర్స్ తీర్చిదిద్దారా? తంగలాన్ లాగానే తెలుగులోనూ.. తమిళ పేరుతోనే విడుదలవుతున్న కంగువ ఎలా ఉండబోతోంది?

సూర్య హీరోగా నటించిన కంగువ మీద మామూలు అంచనాలు లేవు. 35కి పైగా భాషల్లో విడుదలవుతోంది ఈ సినిమా. సూర్య బర్త్ డే రోజు రిలీజ్ చేసిన ఫైర్ సాంగ్ ఆకట్టుకుంటోంది.

నీ రక్తమూ నా రక్తమూ వేరువేరా? అని సూర్య చెప్పే డైలాగును బట్టి, ఇది దాయాదుల మధ్య పోరేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రైలర్ జనాల్లోకి ఇన్‌స్టంట్‌గా వెళ్లడానికి విజువల్స్ ఎంత బాగా ఉపయోగపడుతున్నాయో, అంతకన్నా ఎక్కువగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యూజ్ అవుతోంది.





























