- Telugu News Photo Gallery Cinema photos R. Narayanamurthy to Tabu latest film news from cinema industry
Film News: ఆర్.నారాయణమూర్తి హెల్త్ అప్డేట్.. అమెరికన్ సీరీస్‌లో టబు..
ఆర్.నారాయణమూర్తి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఫ్రెండ్‌షిప్ అండ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ కమిటీ కుర్రాళ్లు సినిమా ఆగస్టు 9న విడుదల కానుంది. అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా విడాముయర్చి. తనకూ, జాన్వీకి మధ్య ఫ్రెండ్లీ రిలేషన్ లేదని అన్నారు నటుడు గుల్షన్ దేవయ్య. డ్యూన్ ప్రాఫెసీ అనే అమెరికన్ సైన్స్ ఫిక్షన్ సీరీస్‌లో నటించారు టబు.
Updated on: Jul 25, 2024 | 4:47 PM

ఆర్.నారాయణమూర్తి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల అస్వస్తతకు గురయిన ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకున్నారు. దేవుడి దయ వల్ల తన ఆరోగ్యం కుదుటపడిందని అన్నారు. తన క్షేమాన్ని కోరుకున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు నారాయణమూర్తి.

ఫ్రెండ్‌షిప్ అండ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ కమిటీ కుర్రాళ్లు సినిమా ఆగస్టు 9న విడుదల కానుంది. నీహారిక కొణిదెల సమర్పిస్తున్న సినిమా ఇది. గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమా ఇది. న్యూ టాలెంట్‌ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను చేసినట్టు తెలిపారు నీహారిక కొణిదెల.

అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా విడాముయర్చి. త్రిష నాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అజిత్ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తారట. స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతోంది ఈ సినిమా. ఈ నెల 23 వరకు అజర్‌బైజాన్‌లో చిత్రీకరణ సాగుతుంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.

తనకూ, జాన్వీకి మధ్య ఫ్రెండ్లీ రిలేషన్ లేదని అన్నారు నటుడు గుల్షన్ దేవయ్య. సెట్లో తామిద్దరం ప్రొఫెషనల్స్ గా వ్యవహరించే వాళ్లమని చెప్పారు. జోక్స్ చెప్పుకోవడం, సరదాగా మాట్లాడుకోవడం ఎప్పుడూ లేదన్నారు. వీరిద్దరూ కలిసి నటించిన ఉలఝ్ సినిమా ఆగస్టు 2న విడుదలకు సిద్ధమవుతోంది.

డ్యూన్ ప్రాఫెసీ అనే అమెరికన్ సైన్స్ ఫిక్షన్ సీరీస్‌లో నటించారు టబు. 2021లో వచ్చిన డ్యూన్‌కి ప్రీక్వెల్‌గా తెరకెక్కింది ఈ సీరీస్. సిస్టర్ ఫ్రాన్సెస్కా పాత్రలో టబు కనిపిస్తారు. ఇటీవల విడుదలైన టీజర్‌కి చాలా మంచి స్పందన వస్తోంది. నవంబర్‌లో ఈ టీజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.




