- Telugu News Photo Gallery Cinema photos Special story on Allu Arjun for Best Actor at National Films Award 2023 telugu cinema news
Allu Arjun: తెలుగు సినీ చరిత్రలో రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్.. 68 ఏళ్ల జాతీయ సినిమా అవార్డ్స్‌లో..
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. తెలుగు సినీ పరిశ్రమలో ఆయనకున్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. బాలనటుడిగా సినీ ప్రయాణం ఆరంభించి ఇప్పుడు హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు అల్లు అర్జున్. గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్.. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించారు. హీరోగా తన ప్రయాణంలో అనేక విమర్శలు ఎదురైనా ప్రతి అడుగులోనూ అనేక విషయాలు నెర్చుకుంటూ నటుడిగా ప్రశంసలు అందుకున్నారు.
Updated on: Aug 24, 2023 | 8:55 PM

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. తెలుగు సినీ పరిశ్రమలో ఆయనకున్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. బాలనటుడిగా సినీ ప్రయాణం ఆరంభించి ఇప్పుడు హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు అల్లు అర్జున్.

గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్.. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించారు. హీరోగా తన ప్రయాణంలో అనేక విమర్శలు ఎదురైనా ప్రతి అడుగులోనూ అనేక విషయాలు నెర్చుకుంటూ నటుడిగా ప్రశంసలు అందుకున్నారు.

పుష్ప సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా ఆయన క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు బన్నీ.

ఇక ఇప్పుడు 68 ఏళ్ల జాతీయ చలనచిత్ర అవార్డుల చరిత్రలో ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన తొలి తెలుగు హీరోగా సరికొత్త రికార్డ్ సృష్టించారు అల్లు అర్జున్.

ఈసినిమాలో అల్లు అర్జున్ మ్యానరిజం.. నటన.. డైలాగ్స్ సినీప్రియులను ఆకట్టుకోవడమే కాదు.. బన్నీ పై వచ్చిన ప్రతి విమర్శకు పుష్ప సినిమాతో సమాధానమిచ్చారు.




