- Telugu News Photo Gallery Cinema photos Here the National Film Awards 2023 Telugu movies, Actors and Actress full list telugu movie news
National Film Awards 2023: జాతీయ చలనచిత్ర అవార్డుల్లో టాలీవుడ్‌కు ఎన్ని అవార్డ్స్ వచ్చాయంటే..
భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులను 2023 కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. 2021 సంవత్సరానికిగానూ బెస్ట్ మూవీస్.. ఉత్తమ నటీనటులతోపాటు పలు విభాగాల్లో అవార్డ్స్ విజేతలను ప్రకటించారు. దాదాపు 68 ఏళ్ల జాతీయ చలనచిత్ర అవార్డ్స్ చరిత్రలో ఈసారి ఆర్ఆర్ఆర్ సత్తా చాటింది. అలాగే అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు.
Updated on: Aug 24, 2023 | 7:36 PM

పుష్ప ది రైజ్ చిత్రంలో నటనకు గానూ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించారు. ఇక ఇదే చిత్రానికిగానూ ఉత్తమ మ్యూజిక్ డైరెక్షన్‌గా దేవీ శ్రీ ప్రసాద్ అవార్డ్ గెలుచుకున్నారు.

ఇక ఉత్తమ సినిమాగా డైరెక్టర్ బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఉప్పెన చిత్రం ఎంపికైంది. ఇందులో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించగా.. తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు.

ఇక నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2023లో ఆర్ఆర్ఆర్ సినిమా సత్తా చాటింది. జాతీయ చలనచిత్ర అవార్డ్స్ లో ట్రిపుల్ ఆర్ ఏకంగా 6 అవార్డ్స్ అందుకుంది. ఉత్తమ డ్యాన్స్ కొరియోగ్రఫీ (ప్రేమ్ రక్షిత్), ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ (కింగ్ సాలమన్), ఉత్తమ బ్యాగ్రౌండ్ సింగర్ కాలభైరవ (ఆర్ఆర్ఆర్), ఉత్తమ పాపులర్ ఫిల్మ్, ఉత్తమ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కేటగిరిల్లో ఆర్ఆర్ఆర్ అవార్డ్స్ గెలుచుకుంది.

ఇక ఉత్తమ గేయ రచయితగా చంద్రబోస్ జాతీయ అవార్డ్ గెలుచుకున్నారు. వైష్ణవ్ తేజ్ నటించిన కొండపొలం సినిమాగానూ చంద్రబోస్ నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్నారు.