- Telugu News Photo Gallery Cinema photos Theatres Full with Re Release Movies in Tollywood Telugu Entertainment Photos
Tollywood: రీరిలీజ్ లతో దద్దరిల్లిపోతున్న థియేటర్స్.. కొత్త సినిమాల కంటే ఎక్కువగా..
చిన్న సినిమాలు బతకాలి.. అవి ఉంటేనే ఇండస్ట్రీకి మనుగడ అంటూ చాలా మంది లెక్చర్లు దంచేస్తుంటారు. కానీ నిజంగా ఇండస్ట్రీలో ఆ చిన్న సినిమాలను బతకనిస్తున్నారా..? అరే.. పెద్ద సినిమాలేవీ లేవు మా సినిమాలు రిలీజ్ చేసుకుందాం అనుకునే టైమ్‌కు రీ రిలీజ్ అంటూ పిడుగేస్తున్నారు. అసలు రీ రిలీజ్ సినిమాలు ఇండస్ట్రీకి మంచి చేస్తున్నాయా.. ముంచేస్తున్నాయా..? వీటివల్ల చిన్న సినిమా చచ్చిపోతుందా..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.
Updated on: Aug 24, 2023 | 7:07 PM

చిన్న సినిమాలు బతకాలి.. అవి ఉంటేనే ఇండస్ట్రీకి మనుగడ అంటూ చాలా మంది లెక్చర్లు దంచేస్తుంటారు. కానీ నిజంగా ఇండస్ట్రీలో ఆ చిన్న సినిమాలను బతకనిస్తున్నారా..? అరే.. పెద్ద సినిమాలేవీ లేవు మా సినిమాలు రిలీజ్ చేసుకుందాం అనుకునే టైమ్‌కు రీ రిలీజ్ అంటూ పిడుగేస్తున్నారు. అసలు రీ రిలీజ్ సినిమాలు ఇండస్ట్రీకి మంచి చేస్తున్నాయా.. ముంచేస్తున్నాయా..? వీటివల్ల చిన్న సినిమా చచ్చిపోతుందా..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..

ఈ మధ్య కాలంలో అకేషన్‌తో పని లేకుండా పాత సినిమాల్ని రీ రిలీజ్ చేస్తూనే ఉన్నారు దర్శక నిర్మాతలు. ఇండస్ట్రీకి ఒక రకంగా ఇది మంచిదే. థియేటర్స్‌కు కాస్తో కూస్కో రెవిన్యూ జనరేట్ అవుతుంది. అయితే ఈ రీ రిలీజ్‌ల కారణంగా చిన్న సినిమాలు చితికిపోతున్నాయి. జల్సా, పోకిరి, బిజినెస్ మ్యాన్ లాంటి సినిమాలు రీ రిలీజ్ అయినపుడు.. ఆ వారం వచ్చిన చిన్న సినిమాలు బలైపోయాయి.

రీ రిలీజ్‌లకు కలెక్షన్లు పెరిగాయి. థియేటర్ల ఆక్యుపెన్సీ పెరిగింది. కానీ చిన్న సినిమాలున్నపుడు.. రీ రిలీజ్ చేస్తుంటే ఆ ప్రభావం వాటిపై ఎక్కువగా పడుతుంది. కంటెంట్ బాగుంటే.. అది కూడా కేవలం వీకెండ్స్‌లో మాత్రమే థియేటర్స్‌కు వస్తున్నారు ప్రేక్షకులు.. వీక్ డేస్‌లో జనమే ఉండట్లేదు. ఎంత పెద్ద హీరో ఉన్నా.. నచ్చకపోతే మొదటి రోజే మొహం తిప్పేస్తున్నారు.

వీక్ డేస్‌లో రీ రిలీజ్‌లు పెట్టుకుంటే.. వాటికెలాగూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది కాబట్టి అప్పుడు థియేటర్స్ ఆక్యుపెన్సీ పెరుగుతుంది.. అలాగే చిన్న సినిమాలకు శుక్రవారాలు ఇచ్చేస్తే సరిపోతుంది. అలా కాకుండా అన్నీ ఒకేసారి తీసుకొస్తే దానివల్ల చిన్నోళ్లే చితికిపోతున్నారు. రేపు గుడుంబా శంకర్, గబ్బర్ సింగ్ కూడా సెప్టెంబర్ 2 వీకెండ్‌లోనే విడుదల కానుంది. మన్మథుడు మాత్రం ఆగస్ట్ 29న మంగళవారం రీ రిలీజ్ అవుతుంది.

మన నిర్మాతలు టికెట్ రేట్లు పెంచుకోడానికి ఆలోచించారు కానీ తగ్గించడంపై ఎప్పుడూ ఫోకస్ చేయలేదు. నార్త్‌లో వీకెండ్ కంటే వీక్ డేస్‌లో టికెట్ రేట్ తక్కువగా ఉంటుంది.. ఆడియన్స్‌ను ఆకట్టుకోడానికి అదొక ప్లాన్. మన దగ్గర అదే చేస్తే థియేటర్స్‌కు కళ వస్తుంది. అదే సమయంలో రీ రిలీజ్‌ల టైమ్ చిన్న సినిమాలకు అడ్డు రాకుండా చూసుకుంటే మంచిది. ఇవన్నీ జరిగితే బాగున్ను.. కానీ జరుగుతాయా..?





























