- Telugu News Photo Gallery Cinema photos Samantha Ruth Prabhu New Relationship with Raj Nidimoru Rumors Explode
Samantha: మీరు సినిమాలు చేసి ట్రెండ్ అవుతారు ఏమో.. నేను చేయకుండానే ట్రెండ్ అవుతా
సమంత తన రిలేషన్ గురించి ఓపెన్ అవుతున్నారా..? తాను సింగిల్ కాదని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారా..? తాను రిలేషన్‌లో ఉన్నాననే విషయాన్ని ప్రపంచానికి చెప్పాలని చూస్తున్నారా..? ఈమె మళ్లీ ప్రేమలో పడ్డారా..? విడాకుల తర్వాత హైదరాబాద్ వదిలేయడానికి.. ముంబైలో ఉండటానికి కారణం అదేనా..? స్యామ్ రెండో పెళ్లి నిజమే అయితే.. ఎవరా పర్సన్..? గుడ్ న్యూస్ ఎప్పుడు..?
Updated on: Aug 01, 2025 | 3:51 PM

విడాకుల తర్వాత సమంత కాన్సట్రేషన్ అంతా బాలీవుడ్‌పైనే ఉంది. తెలుగు ఇండస్ట్రీకి రమ్మన్నా రావట్లేదు. పైగా సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్‌లు మాత్రమే చేస్తున్నారీమే. రెండేళ్ల కింద విజయ్ దేవరకొండ ఖుషీ సినిమాలో నటించాక.. తెలుగులో కనిపించడమే మానేసారు స్యామ్.

ప్రస్తుతం ఈమెపై క్రేజీ రూమర్స్ వస్తున్నాయి. కొన్నేళ్లుగా బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమూరుతో సమంత డేట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ సిరీస్‌లను తెరకెక్కించిన దర్శకుల్లో రాజ్ ఒకరు.

మరో దర్శకుడు DK. ఈ ఇద్దరూ తెలుగు వాళ్లు. కొన్ని రోజులుగా దర్శకుడు రాజ్ నిడుమూరుతో తరుచూ జంటగా కనిపిస్తున్నారు సమంత. తాజాగా ఒకే కారులో కలిసి కనిపించారు ఈ ఇద్దరూ.

ఆ మధ్య ఓ పార్టీలో.. ఆ తర్వాత పికిల్‌బాల్ స్పోర్ట్స్ ఈవెంట్, కామన్ ఫ్రెండ్స్ పార్టీ, మొన్నటికి మొన్న తిరుమలలోనూ కలిసే కనిపించారు రాజ్ సమంత. తాజాగా ముంబైలోని ఓ రెస్టారెంట్ దగ్గర ఒకే కారులో కలిసి వచ్చారు.

ప్రస్తుతం స్యామ్ నటిస్తున్న రక్త్ బ్రహ్మాండ్ తెరకెక్కిస్తున్నది రాజ్ డికే ద్వయమే. ఇదంతా చూస్తుంటే తాను సింగిల్ కాదని స్యామ్ హింట్ ఇస్తున్నట్లే అనిపిస్తుంది.




