- Telugu News Photo Gallery Cinema photos Know Anushka Shetty Vedam Poster Cause Many Accidents In Hydrebad, Details here
Anushka Shetty: అనుష్క దెబ్బకు 40 యాక్సిడెంట్స్.. ఒక్క పోస్టర్‍తో ఆగమాగం.. కట్ చేస్తే..
అనుష్క శెట్టి తెలుగు అడియన్స్ హృదయాలు దోచుకున్న హీరోయిన్. 2005లో సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచమయైంది. ఫస్ట్ మూవీతో అందం, యాక్టింగ్ తో మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత తెలుగులో అనేక చిత్రాల్లో నటించి టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.
Updated on: Aug 01, 2025 | 1:35 PM

ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమను ఏలిన హీరోయిన్లలో అనుష్క ఒకరు. సూపర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి విక్రమార్కుడు, అరుంధతి, లక్ష్యం, శౌర్యం, డాన్, ఢమరుకం, బిల్లా, సింగం, మిర్చి, బాహుబలి, బాహుబలి 2 సినిమాలతో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది.

గ్లామరస్ హీరోయిన్ గా.. ఇటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ అదరగొట్టింది. కథ, పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ తనదైన ముద్ర వేసింది. బాహుబలి సినిమా తర్వాత సినిమాలు తగ్గించింది. ప్రస్తుతం ఘాటీ చిత్రంలో నటిస్తుంది అనుష్క.

ఇదిలా ఉంటే.. అనుష్క కెరీర్ లో బాగా గుర్తుండిపోయే సినిమాల్లో వేదం ఒకటి. కెరీర్ పీక్స్ లో ఉండగానే ఈ సినిమాలో వేశ్య పాత్రలో కనిపించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి తెరకెక్కించిన ఈ సినిమాలో అల్లు అర్జున్, మంచు మనోజ్ నటించారు.

అయితే ఈ సినిమా సమయంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగిందట. వేదం సినిమా నుంచి అనుష్క పసుపు చీర కట్టుకుని వెనక్కి తిరిగి చూస్తున్న స్టిల్స్ ప్రమోషన్స్ కోసం వాడారు. హైదరాబాద్ లో పలు చోట్ల హోర్డింగ్స్ పెట్టారట. పంజాగుట్ట సర్కిల్ లోనూ పెద్ద హోర్డింగ్ పెట్టారట.

అందులో అనుష్కను చూస్తూ చాలా యాక్సిడెంట్స్ జరిగాయట. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 యాక్సిడెంట్స్ వరకు జరిగాయట. పెద్ద యాక్సిడెంట్స్ కాదు.. హోర్డింగ్ చూస్తూ ముందు ఉన్న వాహనాలను ఢీకొట్టేవారట. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అనుష్క హోర్డింగ్ తొలగించారట.




