- Telugu News Photo Gallery Cinema photos Mrunal Thakur Birthday Special Know Her Net Worth, Car Collection and Remuneration Details
Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ ఆస్తులు ఎంతో తెలుసా.. ? ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ ఎంతంటే..
టీవీ నుంచి బాలీవుడ్ బిగ్ స్క్రీన్ వరకు ఎన్నో అవమానాలు, సవాళ్లు ఎదుర్కొని నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, హిందీ భాషలలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. ఇప్పుడు ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఆమె ఒకరు.
Updated on: Aug 01, 2025 | 1:08 PM

మృణాల్ ఠాకూర్ క్రేజ్ గురించి తెలిసిందే. బుల్లితెరపై కుంకుమ్ భాగ్య సీరియల్ ద్వారా ఫేమస్ అయిన ఈ అమ్మడు.. నెమ్మదిగా సినీరంగంవైపు అడుగులు వేసింది. ఆ తర్వాత తెలుగు, హిందీ భాషలలో వరుస సినిమాలతో అలరించింది. ఈరోజు మృణాల్ 33వ పుట్టినరోజు.

1992 ఆగస్ట్ 1న మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో జన్మించిన ఈ అమ్మడు.. సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్‌లో.. ముంబైలోని కెసి కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేసింది. స్టార్ ప్లస్‌లో ముజ్సే కుచ్ కెహ్తి... యే ఖామోషియాన్ అనే టీవీ షోతో టెలివిజన్‌లోకి అడుగుపెట్టింది.

లవ్ సోనియా సినిమాతో కథానాయికగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సినీప్రయాణం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత జెర్సీ మూవీతో మరో హిట్ అందుకుంది. సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఫస్ట్ మూవీతోనే హిట్టు అందుకున్న మృణాల్.. ఆ తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాల్లో నటించింది.

ప్రస్తుతం అడివి శేష్ జోడిగా డెకాయిట్ చిత్రంలో నటిస్తుంది. నివేదికల ప్రకారం మృణాల్ ఆస్తులు రూ.33 కోట్లు ఉంటుందని అంచనా. ఒక్కో సినిమాకు రూ.2 నుంచి 3 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. నెలకు రూ.60 లక్షలకుపైగా సంపాదిస్తుంది.

అలాగే హోండా అకార్డ్, స్టైలిష్ టయోటా ఫార్చ్యూనర్, మెర్సిడెస్-బెంజ్ S-450 4MATIC (1.80 కోట్ల రూపాయలు. 2023లో కొనుగోలు చేసింది) వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె తెలుగులో డెకాయిట్ సినిమాతోపాటు హిందీలోనూ పలు చిత్రాల్లో నటిస్తుంది.




