- Telugu News Photo Gallery Cinema photos Reasons Behind Heroes Sai Durgha Tej Akash Jagannadh Changing Their Names
Tollywood News: పేరు మారితే లక్కు మారుతుందంటున్న కుర్ర హీరోలు
పేరులో ఏముంది.. మనకు రాసిపెట్టుండాలి గానీ అనుకుంటారు కొందరు. కానీ పేరులోనే అంతా ఉందని నమ్ముతుంటారు మరికొందరు. ఇండస్ట్రీలో ఈ సెంటిమెంట్ ఇంకాస్త ఎక్కువే. అందుకే ఉన్న పేర్లు కాదని.. కొత్త పేర్లు పెట్టుకుంటున్నారు హీరోలు. తాజాగా మరో కుర్ర హీరో కూడా పేరు మార్చుకున్నాడు. మరి ఆయనెవరు..? అసలు నేమ్ ఛేంజింగ్ సీక్రేట్స్ ఏంటి..? సినిమా ఇండస్ట్రీలో పేరు మార్చుకోవడం అనేది చాలా కామన్ థింగ్. కాకపోతే మొదట్లోనే నేమ్ ఛేంజ్ చేసుకుంటారు చాలా మంది.
Updated on: Jul 29, 2024 | 6:45 PM

సమయం దొరికినప్పుడల్లా ఏదో ఒక సామాజిక సేవలో ఇన్వాల్వ్ అవుతున్న తేజ్, లేటెస్ట్ గా ఉషాపరిణయం ఈవెంట్‌కి ఛీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ లుక్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

సినిమా ఇండస్ట్రీలో పేరు మార్చుకోవడం అనేది చాలా కామన్ థింగ్. కాకపోతే మొదట్లోనే నేమ్ ఛేంజ్ చేసుకుంటారు చాలా మంది. కానీ కొందరు మాత్రం ఇండస్ట్రీకి వచ్చాక.. గుర్తింపు తెచ్చుకున్నాక పేరు మార్చేస్తుంటారు.

ఈ బ్యాచ్‌లోనే తాజాగా చేరిపోయారు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ. ఈయన తన పేరును ఆకాశ్ జగన్నాథ్‌గా మార్చుకున్నారు.చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయమైన ఆకాశ్ పూరీ.. మెహబూబాతో హీరో అయ్యారు.

రొమాంటిక్, ఛోర్ బజార్ లాంటి సినిమాలు చేసినా లక్ కలిసిరాలేదు. దాంతో ఆకాశ్ పూరీ నుంచి ఆకాశ్ జగన్నాథ్‌గా తన పేరు మార్చుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మధ్యే సాయి ధరమ్ తేజ్ సైతం తన పేరు సాయి దుర్గ తేజ్‌గా మార్చుకున్నారు. అమ్మ పేరు దుర్గ కావడంతో.. ఆ పేరును తన పేరులో చేర్చుకున్నారు.

ఆల్రెడీ సాయి ధరమ్ తేజ్‌గా ఉన్న తన పేరును సాయి తేజ్‌గా మార్చుకున్న మెగా మేనల్లుడు.. మరో మార్పు చేసి సాయి దుర్గ తేజ అయ్యారు. అప్పట్లో కథ సినిమాతో హీరోగా పరిచయమైన అదిత్ అరుణ్ కూడా త్రిగుణ్‌గా తన పేరు మార్చుకున్నారు. వీళ్లందరి కంటే ముందే తన పేరు నుంచి తేజ్ తీసేసారు రామ్ చరణ్. మొత్తానికి హీరోల పేరు మార్పు ట్రెండ్ అయిపోయిందిప్పుడు.




