- Telugu News Photo Gallery Cinema photos Ram charan Buchi Babu Movie RC16 shooting update and auditions in ap Telugu Heroes Photos
Ram Charan – RC16: ఉన్నట్లుండి ట్రేండింగ్ లో RC16 తో రామ్ చరణ్.! ఎందుకంటే.?
ఉన్నట్లుండి రామ్ చరణ్ నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్నారు.. సీన్‌లోనే లేని RC16 నెంబర్ వన్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.. శంకర్ సినిమా సెట్స్‌పై ఉన్నా.. ఇంకా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకోని బుచ్చిబాబు ప్రాజెక్ట్ ఎందుకు సడన్‌గా ట్రెండింగ్‌లోకి వచ్చింది..? ఈ సినిమా కొత్త అప్‌డేట్స్ ఏవైనా వచ్చాయా..? వస్తే అవేంటి..? అసలు బుచ్చిబాబు సినిమా కథ ఎంతవరకు వచ్చింది..?
Updated on: Feb 10, 2024 | 9:45 PM

గేమ్ ఛేంజర్ అప్‌డేట్స్ కోసం చూసి చూసి రామ్ చరణ్ ఫ్యాన్స్ విసిగిపోయారు. ఇదిలా ఉంటే ఉన్నట్లుండి RC16 నేషనల్ వైడ్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. బుచ్చిబాబు తెరకెక్కించబోయే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికే RC16 ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా జరుగుతుంది. పాన్ వరల్డ్ స్థాయిలో దీన్ని ప్లాన్ చేస్తున్నారు బుచ్చిబాబు. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా రానుందీ చిత్రం. ఇందులో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న గేమ్ ఛేంజర్‌లోనూ ద్విపాత్రాభినయమే చేస్తున్నారు చరణ్.

ఈయన గతంలో డ్యూయల్ రోల్ చేసిన మగధీర, నాయక్ మంచి విజయం సాధించాయి. దాంతో ఇదే సెంటిమెంట్ గేమ్ ఛేంజర్, బుచ్చిబాబు సినిమాలకు వర్కవుట్ అవుతుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్. బుచ్చిబాబు సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.

ఈయన ఎంట్రీతో RC16కి ఇంటర్నేషనల్ క్రేజ్ వచ్చేసింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతితో పాటు శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నటించడానికి కాస్టింగ్ కాల్ ఇచ్చారు దర్శకుడు బుచ్చిబాబు.

ఉత్తరాంధ్ర నేపథ్యం సినిమా కావడంతో.. అక్కడి నటీనటులకు ఆహ్వానం పలుకుతూ వీడియో విడుదల చేసారు. వయసుతో సంబంధం లేకుండా అందర్నీ ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు బుచ్చిబాబు.

అన్నీ కుదిర్తే ఆగస్ట్ నుంచి RC16 షూటింగ్ మొదలు కానుంది. దీన్ని కేవలం 8 నెలల్లోనే పూర్తి చేయాలని చూస్తున్నారు బుచ్చి. సమ్మర్ 2025 విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.