- Telugu News Photo Gallery Cinema photos Prabhas Kalki 2898 AD movie production house vyjayanthi movies follow data sentiment on release date Telugu Heroes Photos
Prabhas – Kalki: కల్కి విషయంలో బాహుబలి 2 సెంటిమెంట్ రిపీట్ కాబోతుందా..? ప్రభాస్ బాక్సాఫీస్ వీరంగం.
కల్కి విషయంలో బాహుబలి 2 సెంటిమెంట్ రిపీట్ కాబోతుందా..? అప్పుడు జరిగినట్లే మరోసారి ప్రభాస్ బాక్సాఫీస్ దగ్గర వీరంగం సృష్టించబోతున్నారా..? దానికి వైజయంతి మూవీస్ సెంటిమెంట్ కూడా తోడు కాబోతుందా..? సమ్మర్ మొత్తాన్ని సింగిల్ హ్యాండ్‌లో కబ్జా చేయడానికి కల్కి వస్తున్నారా..? అసలు ప్రాజెక్ట్ కే, బాహుబలి 2 మధ్య ఉన్న పోలికలేంటి.? ప్రభాస్ జాతకం బాహుబలి నుంచే మారిపోయింది. ఫస్ట్ పార్ట్‌తో చిన్న టీజర్ చూపించిన ప్రభాస్.. కంక్లూజన్‌తో చరిత్ర సృష్టించారు.
Updated on: Feb 10, 2024 | 9:45 PM

కల్కి విషయంలో బాహుబలి 2 సెంటిమెంట్ రిపీట్ కాబోతుందా..? అప్పుడు జరిగినట్లే మరోసారి ప్రభాస్ బాక్సాఫీస్ దగ్గర వీరంగం సృష్టించబోతున్నారా..? దానికి వైజయంతి మూవీస్ సెంటిమెంట్ కూడా తోడు కాబోతుందా..?

సమ్మర్ మొత్తాన్ని సింగిల్ హ్యాండ్‌లో కబ్జా చేయడానికి కల్కి వస్తున్నారా..? అసలు ప్రాజెక్ట్ కే, బాహుబలి 2 మధ్య ఉన్న పోలికలేంటి.? ప్రభాస్ జాతకం బాహుబలి నుంచే మారిపోయింది. ఫస్ట్ పార్ట్‌తో చిన్న టీజర్ చూపించిన ప్రభాస్.. కంక్లూజన్‌తో చరిత్ర సృష్టించారు.

ఏకంగా 1800 కోట్లకు పైగా వసూలు చేసి ప్రభాస్ రేంజ్ అమాంతం పెంచేసింది. ఆ స్థాయి విజయం కోసం ఇంకా వేచి చూస్తూనే ఉన్నారు ప్రభాస్. చూస్తుంటే ఆ కల కల్కితో కంప్లీట్ అయ్యేలా కనిపిస్తుంది. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి సినిమా కూడా రెండు భాగాలుగా వస్తున్నట్లు తెలుస్తుంది.

దీనిపై ఇప్పటి వరకు అధికారిక సమాచారం ఇవ్వలేదు దర్శక నిర్మాతలు. మే 9న విడుదల కాబోయేది మొదటి భాగమే అని.. రెండో భాగం షూటింగ్ కూడా ఒకేసారి నాగ్ అశ్విన్ పూర్తి చేస్తున్నారని తెలుస్తుంది. దాని రిలీజ్ డేట్‌పై కూడా త్వరలోనే క్లారిటీ రానుంది.

కల్కి 2898 ADకి బాహుబలి 2కి మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అవి చూసి ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 2017 ఎప్రిల్ 28న బాహుబలి 2 విడుదలైంది. ఆ ఇయర్ సమ్మర్ మొత్తాన్ని ప్రభాస్ ఒక్కడే యూజ్ చేసుకున్నారు.

బాహుబలి 2 వచ్చిన 45 రోజుల తర్వాత 2017 జూన్ 23న అల్లు అర్జున్ డిజే విడుదలైంది. ఆ నెలన్నర ఒక్కరు కూడా బాహుబలి 2ను డిస్టర్బ్ చేయలేదు. చూస్తుంటే 2024లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తుంది. వైజయంతి మూవీస్ నిర్మించిన జగదేకవీరుడు అతిలోకసుందరి, మహానటి విడుదలైన మే 9నే కల్కి రానుంది.

పైగా 2017లో డిజేతో వచ్చినట్లు.. ఇప్పుడు పుష్ప 2తో కల్కి వచ్చిన 2 నెలలకు వస్తున్నారు బన్నీ. నాని, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు సమ్మర్‌లోనే వస్తున్నా.. కల్కి రేంజ్ వేరు కాబట్టి సీజన్ అంతా ప్రభాస్ సోలోగా పండగ చేసుకోవచ్చు.




