- Telugu News Photo Gallery Cinema photos Rajinikanth's Coolie Creates Overseas Buzz Singapore Police Viral Post
Coolie: రజనీయా మజాకా.. రీల్ చేసిన సింగపూర్ పోలీస్
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా యంగ్ సెన్సేషన్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కూలీ. బిగ్గెస్ట్ ఎవ్వర్ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పుడు ఓవర్ సీస్‌లో మంచి హైప్ క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా రజనీకి బాగా పట్టున్న సింగపూర్ లాంటి చోట్ల... కూలీ క్రేజ్ పీక్స్‌లో ఉంది. ఈ ఇండిపెండెన్స్ డేకి కూలీగా ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్.
Updated on: Aug 10, 2025 | 4:44 PM

ఈ ఇండిపెండెన్స్ డేకి కూలీగా ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. అది కూడా లోకేష్ కనగరాజ్ లాంటి క్రేజీ డైరెక్టర్ కెప్టెన్సీలో కావటంతో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.

అందుకే ప్రీ రిలీజ్ బజ్‌తో పాటు అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ నయా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది కూలీ.రజనీకి మంచి పట్టున్న అదర్ కంట్రీస్‌లోనూ కూలీ క్రేజ్ నెక్ట్స్ లెవల్‌లో ఉంది.

ముఖ్యంగా సింగపూర్, మలేషియా, జపాన్ లాంటి చోట్ల ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా సింగపూర్ పోలీస్ డిపార్ట్‌మెంట్ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కూలీ సాంగ్‌కు సింగపూర్ పోలీస్ ఎలివేషన్ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ఏకంగా అక్కడి గవర్నమెంట్ డిపార్ట్‌మెంటే తలైవా మూవీ సాంగ్‌ను షేర్ చేయటంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓవర్‌సీస్‌లోనూ కూలీ రికార్డులు తిరగరాయటం పక్కా అన్న టాక్ వినిపిస్తోంది.

స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో కింగ్ నాగార్జున నెగెటివ్ రోల్‌లో నటిస్తున్నారు. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, మలయాళ స్టార్ సౌబిన్, మల్టీ టాలెంటెడ్ బ్యూటీ శ్రుతి హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీంతో కూలీ అన్ని భాషల్లోనూ రికార్డు వసూళ్లు సాధించటం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది.




