- Telugu News Photo Gallery Cinema photos Atress surbhi shares her latest stunning photos on social media
Surbhi: ముట్టుకుంటే కందిపోతుందేమో.. సురభి అందాన్ని పొగడాలంటే కష్టమే గురూ..!
తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ సురభి సుపరిచితమే. బీరువా, ఎక్స్ ప్రెస్ రాజా, ఒక్క క్షణం వంటి చిత్రాలతో టాలీవుడ్ అడియన్స్కు దగ్గరయ్యింది. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళంలో ఆడపాదడపా సినిమాలు చేస్తుంది. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Updated on: Aug 10, 2025 | 5:49 PM

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ సురభి సుపరిచితమే. బీరువా, ఎక్స్ ప్రెస్ రాజా, ఒక్క క్షణం వంటి చిత్రాలతో టాలీవుడ్ అడియన్స్కు దగ్గరయ్యింది. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళంలో ఆడపాదడపా సినిమాలు చేస్తుంది. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

సందీప్ కిషన్ నటించిన బీరువా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది సురభి. ఈ సినిమా సక్సెస్ తర్వాత సురభికి ఆఫర్లు బాగానే వచ్చాయి. ఈ క్రమంలోనే 'ఎటాక్', 'జెంటిల్ మేన్', 'ఒక్క క్షణం', 'ఓటర్' తదితర చిత్రాల్లో నటించింది.

తమిళంలోనూ ఈ అమ్మడు పలు సినిమాలు చేసింది. అక్కడా ఈ బ్యూటీకి అదృష్టం కలిసి రాలేదు. చక్కని లావణ్యంతో ఆకర్షించే చూపులతో కుర్రాళ్లను ఆకట్టుకుంది అందాల భామ సురభి.. సురభి చివరగా యంగ్ హీరో ఆది నటించిన శశి సినిమాలో కనిపించింది.

మ్యూజిక్ పరంగా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. దీంతో సురభికి మళ్లీ అంతగా క్రేజ్ రాలేదు. వెండితెరపై ఈ బ్యూటీ యాక్టివ్ కాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం నిత్యం సందడి చేస్తుంది. ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో నటిస్తుంది.

విశ్వంభర సినిమాలో ఈ చిన్నదాని పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందట. సినిమాలో మీ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ వయ్యారి భామ. తాజాగా కొన్ని ఫోటోలు వదిలింది. ఈ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.