బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌తో ఏడోసారి సినిమా చేయబోతున్నారు దర్శకుడు ప్రియదర్శన్. ఈ కాంబినేషన్‌లో వచ్చిన హెరా పెరీ, భూల్ భులయ్యా లాంటి సినిమాలు విజయం సాధించాయి. తాజాగా ఏడో సారి ఈ జోడీ సినిమా చేయబోతున్నారు. ఇది ఏ సినిమాకు రీమేక్ కాదని.. స్ట్రెయిట్ సినిమా అని తెలిపారు ప్రియదర్శన్.