- Telugu News Photo Gallery Cinema photos Nani Hi Nanna and Venkatesh saindhav Movie Different Promotions in Tollywood Telugu Entertaiment Photos
Hi Nanna | Saindhav: కొత్త ట్రెండ్ సృష్టిస్తున్న కొత్త సినిమాలు..! సైంధవ్ టూ హాయ్ నాన్న.
సినిమా తీసేటప్పుడు ఇన్నొవేటివ్ పాయింట్ కోసం ఎంతగా తలలు బద్ధలు కొట్టుకుంటారో, అంతకు వెయ్యి రెట్లు ఇప్పుడు ప్రమోషన్ల గురించి ఆలోచిస్తున్నారు. ఎవరికి వారే, సరికొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేయాలని తాపత్రయపడుతున్నారు. త్వరలో రిలీజ్‌కి రెడీ అవుతున్న కొన్ని సినిమాలు ఇప్పుడు నయా ట్రెండ్‌ని సెట్ చేస్తున్నాయి. వాటి గురించి చూసేద్దాం రండి..! సైంధవ్ పాటను ఒకేసారి రెండు కాలేజీల్లో రిలీజ్ చేసి వావ్ అనిపించారు వెంకీ మామ.
Updated on: Nov 26, 2023 | 2:01 PM

సినిమా తీసేటప్పుడు ఇన్నొవేటివ్ పాయింట్ కోసం ఎంతగా తలలు బద్ధలు కొట్టుకుంటారో, అంతకు వెయ్యి రెట్లు ఇప్పుడు ప్రమోషన్ల గురించి ఆలోచిస్తున్నారు. ఎవరికి వారే, సరికొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేయాలని తాపత్రయపడుతున్నారు.

త్వరలో రిలీజ్‌కి రెడీ అవుతున్న కొన్ని సినిమాలు ఇప్పుడు నయా ట్రెండ్‌ని సెట్ చేస్తున్నాయి. వాటి గురించి చూసేద్దాం రండి..! సైంధవ్ పాటను ఒకేసారి రెండు కాలేజీల్లో రిలీజ్ చేసి వావ్ అనిపించారు వెంకీ మామ.

సంక్రాంతి రేసులో జనవరి 13న విడుదలవుతోంది సైంధవ్. తన కెరీర్‌లో 75వ సినిమా కాబట్టి చాలా ఇష్టంగా ప్రమోట్ చేస్తున్నారు వెంకటేష్. నాని రాజకీయనాయకుడిలాగా కనిపించినప్పుడు అందరూ ఇదేంటి పొలిటికల్ స్ట్రాటజీనా అనుకున్నారు.

అయితే అది హాయ్ నాన్న ప్రమోషన్ కోసం అని వెంటనే అర్థమైంది జనాలకు ఊరికే ప్రెస్ మీట్ పెట్టా అంటూ నాని రిలీజ్ చేసిన వీడియో జనాలకు తెగ నచ్చేసింది.

హాయ్ నాన్న లవ్ స్టోరీ, ఫ్యామిలీ స్టోరీ అని , చెప్పిన తేదీకి పక్కాగా రావడం ఖరారని నాని చెప్పిన మాటలను మళ్లీ మళ్లీ వింటున్నారు జనాలు. ఇటు కోటబొమ్మాళి పీయస్ సినిమా ప్రమోషన్లలోనూ కొత్త తీరు కనిపిస్తోంది.

ఈ మూవీ ఈవెంట్‌లో వెరైటీగా స్టేజ్ మీద మీడియా పర్సన్స్ కనిపించారు. ఈ నెల 24న విడుదల కానుంది కోట బొమ్మాళి. ఈ పబ్లిసిటీ పోకడలు గమనించిన వారు, ఫ్యూచర్‌లో ఈ వింగ్‌లో ఇంకెంత క్రియేటివిటీ కనిపిస్తుందోనని మాట్లాడుకుంటున్నారు.




