- Telugu News Photo Gallery Cinema photos Music helps build hype for Mr. Bachchan and Double Smart movies
Music: ఆ రెండు సినిమాలకు మ్యూజిక్కే హెల్ప్.. ఫిదా చేసిన పాటలు..
ఈ రోజుల్లో పాటలు ఎవరు వింటున్నారు..? అసలు పాటలున్నా లేకపోయినా పట్టించుకోవట్లేదు. చాలా సినిమాలపై ఆడియన్స్ ఫీలింగ్ ఇదే. కానీ ఈ రోజుల్లో కూడా పాటలతో థియేటర్స్‌కు ప్రేక్షకులను రప్పించే సినిమాలు ఉన్నాయంటే నమ్ముతారా..? తాజాగా రెండు సినిమాలకు మ్యూజిక్కే హెల్ప్ అవుతుంది. వాటితోనే హైప్ పెరిగిపోతుంది. మరి ఏంటా సినిమాలు..?
Updated on: Jul 30, 2024 | 9:00 AM

ఎవరు ఔనన్నా కాదన్నా మ్యూజిక్ అనేది సినిమాలకు ప్రాణం. ఈ మధ్య దానిపై పెద్దగా ఫోకస్ చేయట్లేదు దర్శకులు. కానీ ఇప్పటికీ కొన్ని సినిమాలకు పాటలే ప్రాణంగా మారుతున్నాయి.. అంచనాలు పెంచేస్తున్నాయి.

స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న విడుదల కానున్న రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్, రవితేజ మిస్టర్ బచ్చన్.. ఈ రెండు సినిమాలకు కూడా మ్యూజిక్ బాగా హెల్ప్ అయ్యేలా కనిపిస్తుంది.

హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్‌లో వస్తున్న మిస్టర్ బచ్చన్‌పై అంచనాలు బాగానే ఉన్నాయి. పైగా మొన్న విడుదలైన ఫస్ట్ సాంగ్‌పై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి.

రొమాన్స్ ఘాటు ఎక్కువైందని కొందరు విమర్శిస్తే.. ట్యూన్ అదిరిపోయిందంటూ మిక్కీ జే మేయర్‌పై ప్రశంసలు కురిపించారు మరికొందరు. మ్యాటర్ ఏదైనా.. మిస్టర్ బచ్చన్‌కు హెల్ప్ అయిందది.

డబుల్ ఇస్మార్ట్‌కు మణిశర్మ పాటలే ప్రాణం అవుతున్నాయి. ఇస్మార్ట్ శంకర్ పాటలు ఇప్పటికీ మార్మోగుతుండగానే.. సీక్వెల్‌కు వాటిని మించే ట్యూన్స్ ఇచ్చేస్తున్నారు మణి. స్టెప్పా మార్, మార్ ముంతా పాటలకి రెస్పాన్స్ నెక్ట్స్ లెవల్‌లో వచ్చింది. మిగిలిన పాటలు ఇదే స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మణిశర్మ.




