The Raja Saab: ప్రభాస్ ను కొత్తగా చూపిస్తున్న మారుతి.. గ్లింప్స్ క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్
వరసగా ఫాంటసీ డ్రామాలు, భారీ యాక్షన్ థ్రిల్లర్స్ చేస్తున్న ప్రభాస్‌తో మారుతి ఎలాంటి సినిమా చేస్తున్నారు..? ఒకప్పట్లా డార్లింగ్ వేషాలు వేయిస్తున్నాడా లేదంటే ఈయన కూడా ఏదైనా విజువల్ వండర్ ప్లాన్ చేస్తున్నారా..? అసలు రాజా సాబ్ ఎలా ఉండబోతుంది..? ఎప్పుడు విడుదల కాబోతుంది..? ఇవన్నీ ఒక్క టీజర్‌తో క్లారిటీ ఇచ్చేసారు మారుతి అండ్ టీం. బాహుబలి తర్వాత ప్రభాస్‌తో రెగ్యులర్ సినిమాలు చేయడమే మరిచిపోయారు దర్శకులు.
Updated on: Jul 30, 2024 | 1:01 PM

వరసగా ఫాంటసీ డ్రామాలు, భారీ యాక్షన్ థ్రిల్లర్స్ చేస్తున్న ప్రభాస్‌తో మారుతి ఎలాంటి సినిమా చేస్తున్నారు..? ఒకప్పట్లా డార్లింగ్ వేషాలు వేయిస్తున్నాడా లేదంటే ఈయన కూడా ఏదైనా విజువల్ వండర్ ప్లాన్ చేస్తున్నారా..? అసలు రాజా సాబ్ ఎలా ఉండబోతుంది..? ఎప్పుడు విడుదల కాబోతుంది..? ఇవన్నీ ఒక్క టీజర్‌తో క్లారిటీ ఇచ్చేసారు మారుతి అండ్ టీం.

బాహుబలి తర్వాత ప్రభాస్‌తో రెగ్యులర్ సినిమాలు చేయడమే మరిచిపోయారు దర్శకులు. ఆయన డేట్స్ ఇస్తే చాలు.. భారీ యాక్షన్ సినిమాలు లేదంటే లార్జర్ దెన్ లైఫ్ కారెక్టర్లు చేయిస్తూ ఒకప్పటి డార్లింగ్‌ను మర్చిపోయేలా చేసారు దర్శకులు. మధ్యలో రాధే శ్యామ్‌లో లవర్ బాయ్‌లా కనిపించినా.. అందులోనూ భారీగా విజువల్ ఎఫెక్ట్స్ జొప్పించారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్.

సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి.. ఇలా ఏ సినిమా తీసుకున్నా బడ్జెట్ వందల కోట్లు పక్కా. ఇలాంటి సమయంలో కాస్త రిలీఫ్ కోసం చిన్న సినిమా చేయాలని అనుకున్నారు ప్రభాస్. అలా చేస్తున్నదే మారుతితో రాజా సాబ్. మిగిలిన వాటితో పోల్చినపుడు ఇది చిన్న సినిమా అనిపిస్తుందేమో గానీ.. దీనికోసం కూడా 200 కోట్లు ఖర్చు చేస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.

ఇక టాక్ బాగుంటే వసూళ్ళెలా ఉంటాయో సలార్, కల్కి చూపించాయి. ప్రభాస్ రీసెంట్ సినిమాలన్నింటి మధ్యలో రాజా సాబ్‌ను చూస్తుంటే కాస్త చిన్న ప్రాజెక్ట్ అనిపిస్తుంది. పైగా మారుతి దర్శకుడు కావడంతో.. ఏదో ఎంటర్‌టైన్మెంట్ కోసం ఈ సినిమా చేస్తున్నారనుకున్నారంతా.

ఇప్పుడు నిర్మాత టివి విశ్వప్రసాద్ సైతం సమాధానమిచ్చారు. మరి రాజా సాబ్‌పై ఆయనేం అన్నారు..? ప్రభాస్ సినిమా అంటేనే వందల కోట్లు.. వేల కోట్లు అని ఫిక్స్ అయిపోతున్నారు అభిమానులు.




