- Telugu News Photo Gallery Cinema photos Samantha taking time to start shooting for movies which she signed till now
Samantha: ప్లాన్ మార్చేస్తున్న సమంత.. అనేక అనుమానాల మధ్య నలుగుతున్న ఫ్యాన్స్
సమంత ప్లానింగ్ ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు. అనారోగ్యంగానే ఉన్నారా అంటే అదేం లేదు.. ఈ మధ్య సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ అయ్యారు.. పైగా ఫోటోషూట్స్‌తోనూ బిజీ అయ్యారు. పైగా ఈ మధ్యే ఓ సినిమా సైన్ కూడా చేసారు. కానీ ఎక్కడో తెలియని ఓ చిన్న గ్యాప్ మాత్రం మెయింటేన్ చేస్తున్నారు స్యామ్. మరి అది తీరేదెప్పుడు..? మునపట్లా బిజీ అయ్యేదెప్పుడు..? ఖుషీ తర్వాత మళ్లీ స్క్రీన్ మీద కనిపించలేదు సమంత. ఆ మధ్య తన పుట్టిన రోజు నాడు మా ఇంటి బంగారం సినిమా అనౌన్స్ చేసారు ఈ బ్యూటీ.
Updated on: Jul 30, 2024 | 1:01 PM

సమంత ప్లానింగ్ ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు. అనారోగ్యంగానే ఉన్నారా అంటే అదేం లేదు.. ఈ మధ్య సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ అయ్యారు.. పైగా ఫోటోషూట్స్‌తోనూ బిజీ అయ్యారు. పైగా ఈ మధ్యే ఓ సినిమా సైన్ కూడా చేసారు. కానీ ఎక్కడో తెలియని ఓ చిన్న గ్యాప్ మాత్రం మెయింటేన్ చేస్తున్నారు స్యామ్. మరి అది తీరేదెప్పుడు..? మునపట్లా బిజీ అయ్యేదెప్పుడు..?

ఖుషీ తర్వాత మళ్లీ స్క్రీన్ మీద కనిపించలేదు సమంత. ఆ మధ్య తన పుట్టిన రోజు నాడు మా ఇంటి బంగారం సినిమా అనౌన్స్ చేసారు ఈ బ్యూటీ. కానీ దాని షూటింగ్ అప్‌డేట్ ఇప్పటి వరకు ఏం లేదు. మరోవైపు ఈ మధ్యే మమ్ముట్టితో ఓ సినిమా సైన్ చేసారు.

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇకపై గ్యాప్ తీసుకోకూడదని ఫిక్సైపోయారు స్యామ్. కొన్ని రోజులుగా కేవలం యాడ్స్ మాత్రమే చేస్తున్నారు సమంత. అది కూడా సౌత్ కాదు.. బాలీవుడ్ నటులతోనే కమర్షియల్స్‌లో నటిస్తున్నారు.

ఓ వైపు గౌతమ్ మీనన్ సినిమా చేస్తూనే.. మరోవైపు వరసగా వెబ్ సిరీస్‌లకు సైన్ చేస్తున్నారు సమంత. రాజ్ డికే దర్శకత్వంలోనే సిటాడెల్ పూర్తైన తర్వాత.. రక్త్ బ్రహ్మాండ్‌కు ఓకే చెప్పారు సమంత. ఇది ఫాంటసీ యాక్షన్ వెబ్ సిరీస్. రక్త్ బ్రహ్మాండ్‌తో పాటు మరో రెండు వెబ్ సిరీస్‌లు స్యామ్ ఒప్పుకున్నారని తెలుస్తుంది.

మ్యాటర్ ఏదైనా.. ఇకపై గ్యాప్ తీసుకోకూడదు అనేది సమంత ప్లాన్. అందుకే వరసగా కథలు వింటూనే ఉన్నారీమె. ఈ క్రమంలోనే తనకి నచ్చిన ప్రాజెక్ట్స్ ఫైనల్ చేస్తున్నారు. అయితే వెబ్ సిరీస్‌లు మాత్రమే చేస్తుండటం చూస్తుంటే.. సినిమాలు చేస్తారా లేదా అనే అనుమానాలు అయితే ఫ్యాన్స్‌లో వస్తున్నాయి.




