Telugu Movies: టాలీవుడ్ లో షూటింగులు జోరు.. ఏ సినిమాలు సెట్స్ లో ఉన్నాయంటే.?
సమ్మర్‌లో సినిమాలేవీ పెద్దగా విడుదల కావట్లేదు కానీ షూటింగ్స్ కళ మాత్రం బాగానే కనిపిస్తుంది. ముఖ్యంగా స్టార్ హీరోలందరూ సెట్స్‌లోనే ఉన్నారు.. ఒకరిద్దరు మినహా. బాలయ్య అయితే ఓ వైపు రాజకీయాలతో పాటు.. మరోవైపు సినిమాలకు టైమ్ ఇస్తున్నారు. మరి సెట్‌లో ఉన్న హీరోలెవరు.. షూటింగ్‌కు అందుబాటులో లేని వాళ్లెరు..? అన్నీ షూటింగ్ అప్‌డేట్స్‌లో చూద్దాం..
Updated on: Apr 05, 2024 | 4:12 PM

హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్నారు చిరంజీవి. త్వరలోనే ఈయన మళ్లీ విశ్వంభర సెట్‌లో అడుగు పెట్టనున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు మేకర్స్.

ఇక ప్రభాస్, నాగ్ అశ్విన్ కల్కి షూటింగ్ శంకరపల్లిలోనే జరుగుతుంది. ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రకరణ ఫైనల్ స్టేజిలో ఉంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారు మేకర్స్,

గోవా షెడ్యూల్ తర్వాత తాజాగా హైదరాబాద్‌లో దేవర కొత్త షెడ్యూల్ మొదలైంది. అల్యూమీనియం ఫ్యాక్టరీలో ఈ షూట్ జరుగుతుంది. ఈ చిత్రం అక్టోబర్ 10న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్.

అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ RFCలో జరుగుతుంది. దుబాయ్ నుంచి వచ్చాక సెట్‌లో జాయిన్ అయిపోయారు అల్లు అర్జున్. ఇక NBK 109 షూట్ RFC నుంచి చౌటుప్పల్‌కు షిఫ్ట్ అయింది. గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ ఎప్రిల్ 10 నుంచి మొదలు కానుంది. రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్ లక్నోలో జరుగుతుంది.

నాగ చైతన్య తండేల్ చిత్ర షూటింగ్ BHELలో జరుగుతుంది. అక్కడే కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మంచు విష్ణు కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ నుంచి RFCకి షిఫ్ట్ అయింది. నితిన్, వెంకీ కుడుమల రాబిన్ హుడ్‌తో పాటు.. నాని సరిపోదా శనివారం షూటింగ్స్ మొయీనాబాద్‌లో జరుగుతున్నాయి.




