రామ్‌చరణ్ కెరీర్‌ని పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారా? దేని తర్వాత ఏం చేయాలో ఆయనకు ఆల్రెడీ క్లారిటీ ఉందా? ఆ ప్లాన్ ప్రకారమే మూవ్ అవుతున్నారా? ఆయన ప్రెజెంట్ ఫిల్మోగ్రఫీని దగ్గరగా గమనిస్తున్న వారందరూ ఈ విషయం గురించి ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు. ట్రిపుల్ ఆర్‌లో చరణ్ పెర్ఫార్మెన్స్ స్కిల్స్ చూసిన వారు, మరేం ఫర్వాలేదు.. ఇక ఎలాంటి రోల్‌లో అయినా చరణ్ ఇరగదీస్తాడు అని ఫిక్సయ్యారు. ఆ రేంజ్‌లో మెప్పించారు చెర్రీ.